Robinhood: ‘రాబిన్‌హుడ్’.. నితిన్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల

ABN , Publish Date - Mar 30 , 2024 | 03:10 PM

హీరో నితిన్ తనకు బ్లాక్‌బస్టర్ ‘భీష్మ’ అందించిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరోసారి చేస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ హ్యుమరస్ యాక్షన్ అడ్వెంచర్ టీజర్‌లో నితిన్ దొంగగా కనిపించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నితిన్ పుట్టినరోజు స్పెషల్‌గా.. ‘రాబిన్‌హుడ్’ మేకర్స్ ఈ సరికొత్త పోస్టర్‌తో ముందుకు వచ్చారు.

Robinhood: ‘రాబిన్‌హుడ్’.. నితిన్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల
Nithiin in Rabinhood

హీరో నితిన్ (Nithiin) తనకు బ్లాక్‌బస్టర్ ‘భీష్మ’ (Bheeshma) అందించిన దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో మరోసారి చేస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’ (Robinhood). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ హ్యుమరస్ యాక్షన్ అడ్వెంచర్ టీజర్‌లో నితిన్ దొంగగా కనిపించారు. వెంకీ కుడుముల నితిన్ పాత్రను చాలా యూనిక్‌గా ప్రజెంట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నితిన్ పుట్టినరోజు (HBD Nithiin) స్పెషల్‌గా.. ‘రాబిన్‌హుడ్’ మేకర్స్ ఈ సరికొత్త పోస్టర్‌తో ముందుకు వచ్చారు. సినిమాలో ట్రెండీ లుక్‌‌లో కనిపించిన నితిన్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌లో తన అన్‌బిటబుల్ స్టైల్‌ని చూపించారు. (Happy Birthday Nithiin)

ఈ పోస్టర్‌లో బ్లూటూత్ డివైజ్‌లో మాట్లాడుతూ, గ్రేస్ ఫుల్‌గా నడుస్తూ కనిపించారు. నితిన్ ప్యాంట్‌ పాకెట్స్‌లో గన్స్ కూడా వున్నాయి. అతను ఏజెంట్ లాగా ఉన్నాడు. టీ-షర్టుపై ఏజెంట్ RH (రాబిన్‌హుడ్) అని రాసి ఉంది. బ్లాక్ షేడ్స్, వాచ్‌తో పోస్టర్‌లో అద్భుతమైన స్వాగ్‌తో కనిపించారు నితిన్. ఇది నితిన్ అభిమానులకు ప్లజంట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Robinhood New Poster)


Rabinhood.jpg

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ కోసం ఆయన అందించిన స్కోర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Kaliyugam Pattanamlo: షాక్.. ‘కలియుగం పట్టణంలో’ ఆపేశారు..

************************

*Anupama Parameswaran: ఆనందంలో మాటలు రావడంలేదు

************************

*VS10: విశ్వక్‌ సేన్ 10వ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్..

***********************

Updated Date - Mar 30 , 2024 | 03:10 PM