Kaliyugam Pattanamlo: షాక్.. ‘కలియుగం పట్టణంలో’ ఆపేశారు..

ABN , Publish Date - Mar 30 , 2024 | 02:46 PM

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించారు. మార్చి 29న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను శనివారం నుండి నిలుపుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Kaliyugam Pattanamlo: షాక్.. ‘కలియుగం పట్టణంలో’ ఆపేశారు..
Kaliyugam Pattanamlo Movie Poster

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ (Vishwa Karthikeya), ఆయుషి పటేల్ (Ayushi Patel) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి (Ramakhanth Reddy). డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న విడుదల అంటూ అధికారికంగా ప్రకటించి.. చెప్పిన తేదీకే సినిమాను విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం విడుదలై మంచి ప్రశంసలను అందుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఆపేశారు. మళ్లీ త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. (Kaliyugam Pattanamlo Movie Stopped in Theaters)

కారణం ఏంటనేది తెలియలేదు కానీ.. మేకర్సే అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో.. ఇలా ఒక్కరోజు థియేటర్లలో ప్రదర్శించబడి.. ఆపేసిన చిత్రంగా ఈ ‘కలియుగం పట్టణంలో’ రికార్డ్ క్రియేట్ చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని నిలిపి వేస్తున్నామని.. మళ్లీ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. (Kaliyugam Pattanamlo Movie Talk)


Vishva.jpg

ఇక శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులతో ప్రేక్షకులను రంజింపజేసినట్లుగా తెలుస్తోంది. విమర్శకుల నుండి ప్రశంసలు కూడా ఈ మూవీకి వచ్చాయి. విశ్వ కార్తికేయ నటన, ఆయుషి అందం.. నూతన దర్శకుడైనా కూడా రమాకాంత్ రెడ్డి రాసుకున్న కథ, సినిమాను తీసిన విధానంపై ప్రేక్షకులలో పాజిటివ్ స్పందన వినబడింది. మరి మళ్లీ ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనేది తెలియాలంటే.. మేకర్స్ నుండి ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.


ఇవి కూడా చదవండి:

====================

*Anupama Parameswaran: ఆనందంలో మాటలు రావడంలేదు

************************

*VS10: విశ్వక్‌ సేన్ 10వ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్..

***********************

*Manchu Manoj: రామ్ చరణ్‌కి అర్థరాత్రి కాల్ చేశా.. క్షణంలో రూ. 5 లక్షలు పంపాడు

*****************************

Updated Date - Mar 30 , 2024 | 02:46 PM