VS10: విశ్వక్‌ సేన్ 10వ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్..

ABN , Publish Date - Mar 29 , 2024 | 05:24 PM

‘గామి’ సక్సెస్‌తో దూసుకుపోతున్న టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ పుట్టినరోజు (మార్చి 29)ను పురస్కరించుకుని ఆయన కొత్త సినిమాల టైటిల్, ఫస్ట్‌ లుక్‌లను మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మైల్ స్టోన్ మూవీ #VS10 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘మెకానిక్ రాకీ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.

VS10: విశ్వక్‌ సేన్ 10వ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్..

‘గామి’ సక్సెస్‌తో దూసుకుపోతున్న టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) పుట్టినరోజు (మార్చి 29)ను (HBDVishwakSen) పురస్కరించుకుని ఆయన కొత్త సినిమాల టైటిల్, ఫస్ట్‌ లుక్‌లను మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మైల్ స్టోన్ మూవీ #VS10 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి (Ravi Teja Mullapudi) దర్శకత్వంలో, నిర్మాత రామ్ తాళ్లూరి (Ram Talluri) ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ (SRT Entertainments) బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

టైటిల్ పోస్టర్‌ను క్రియేటివ్‌గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లో రాకీగా విశ్వక్ ఇమేజ్‌ చూపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ మాస్‌ను పవర్ ఫుల్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. అతను చేతిలో పెద్ద రెంచ్‌తో సిగరెట్ తాగుతూ కొంటె చూపుతో కనిపించారు. లైట్ గడ్డంతో, స్టైలిష్ దుస్తులను ధరించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మెకానిక్‌ షెడ్‌ కనిపిస్తోంది. టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. (Mechanic Rocky First Look Poster Out)


Vishwak-Sen.jpg

కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందులోన్న ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం, మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు ఇతర పాత్రలలో కనిపించనున్నారు. (Vishwak Sen 10th Film Mechanic Rocky)


ఇవి కూడా చదవండి:

====================

*Manchu Manoj: రామ్ చరణ్‌కి అర్థరాత్రి కాల్ చేశా.. క్షణంలో రూ. 5 లక్షలు పంపాడు

*****************************

*Siddharth and Aditi Rao Hydari: అదితి రావు క్లారిటీ ఇచ్చేసింది

********************

Updated Date - Mar 29 , 2024 | 05:24 PM