మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ravikula Raghurama: విజయ్ సేతుపతి విడుదల చేసిన ట్రైలర్

ABN, Publish Date - Mar 14 , 2024 | 11:48 AM

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో.. సినిమా నిర్మాణం పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మిస్తున్నారు. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Ravikula Raghurama Team with Vijay Sethupathi

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో.. సినిమా నిర్మాణం పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మిస్తున్నారు. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్సిక జంటగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు విడుదలైన ‘చందమామే’, ‘ప్రాణాలే’ సాంగ్స్ శ్రోతలని అలరించగా.. తాజాగా మేకర్స్ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) చేతుల మీదుగా విడుదల చేశారు.

ట్రైలర్ విడుదల అనంతరం విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. అలాగే ఈ సినిమాకు వర్క్ చేసిన నటీనటులు, సాంకేతికనిపుణులందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిత్ర విడుదల సందర్భంగా మూవీ యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. (Vijay Sethupathi about Ravikula Raghurama Trailer)


చిత్ర దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ట్రైలర్ విడుదల చేసిన విలక్షణ నటుడు విజయ్ సేతుపతికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన సపోర్ట్‌తో ఈ సినిమా రేంజే మారిపోయింది. ట్రైలర్ ఆయనకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ట్రైలరే కాదు.. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా సంగీత దర్శకుడు సుకుమార్ పమ్మి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. సినిమా విడుదల తర్వాత ఒక మంచి సినిమా తీశామని మాకు, చూశామని ప్రేక్షకులకు అనిపించేలా.. ఈ సినిమా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు. (Ravikula Raghurama Trailer Out)


ఇవి కూడా చదవండి:

====================

*Kubera: శేఖర్ కమ్ములతో కింగ్ నాగ్ మంతనాలు.. ఫొటో వైరల్

*****************************

*Mahesh Babu: చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వాను

***************************

Updated Date - Mar 14 , 2024 | 11:48 AM