Bhaje Vayu Vegam: కార్తికేయ గుమ్మకొండ హీరోగా ‘భజే వాయు వేగం’.. సూపర్‌స్టార్ సపోర్ట్

ABN , Publish Date - Apr 12 , 2024 | 06:35 PM

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న చిత్రానికి ‘భజే వాయు వేగం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని తెలిపిన మహేష్ బాబు.. మూవీ టీమ్‌కు బెస్ట్ విశెస్ అందించారు.

Bhaje Vayu Vegam: కార్తికేయ గుమ్మకొండ హీరోగా ‘భజే వాయు వేగం’.. సూపర్‌స్టార్ సపోర్ట్
Bhaje Vayu Vegam Movie Still

యూవీ క్రియేషన్స్ (UV Creations) సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) నటిస్తున్న చిత్రానికి ‘భజే వాయు వేగం’ (Bhaje Vayu Vegam) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని తెలిపిన మహేష్ బాబు.. మూవీ టీమ్‌కు బెస్ట్ విశెస్ అందించారు. ‘భజే వాయు వేగం’ సినిమాలో ఐశ్వర్య మీనన్ (Aishwarya Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. ‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ (Rahul Tyson) ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

*Pawan Kalyan: రామ్ చరణ్‌కు అభినందనలు


Bhaje Vayu Vegam.jpg

‘భజే వాయు వేగం’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో క్రికెట్ బ్యాట్‌తో హీరో కార్తికేయ పరుగులు పెడుతుండటం, మరోవైపు పెద్ద మొత్తంలో డబ్బు ఎగరడం కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ‘భజే వాయు వేగం" సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఫ్రెష్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు. (Bhaje Vayu Vegam First Look Out)


ఇవి కూడా చదవండి:

====================

*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

**********************

*Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..

****************************

Updated Date - Apr 12 , 2024 | 06:35 PM