మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Radha Madhavam: హీరో శ్రీకాంత్ వదిలిన ‘రాధా మాధవం’ ట్రైలర్.. ఎలా ఉందంటే?

ABN, Publish Date - Feb 01 , 2024 | 06:57 PM

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరోహీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Radha Madhavam Trailer Launch

గ్రామీణ ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల నుండి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే వాటిల్లో సహజత్వం ఉంటుంది కాబట్టి. ఇప్పుడలాంటి చిత్రమే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమానే ‘రాధా మాధవం’ (Radha Madhavam). వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరోహీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసిన అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూస్తే అందమైన ప్రేమ కథా చిత్రమని తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. హీరో, దర్శక నిర్మాతలకు మంచి గుర్తింపు తీసుకు రావాలి’ అని కోరారు. (Radha Madhavam Trailer Launch)

చిత్ర నిర్మాత గోనాల్ వెంకటేష్, హీరో వినాయక్ దేశాయ్ మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఫిబ్రవరిలో మా సినిమా రాబోతోంది. ఆడియెన్స్ మా సినిమాను చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నామని అన్నారు. ‘మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్‌కు ధన్యవాదాలు. చిత్ర నిర్మాణంలో నిర్మాత ఎంతో సహకరించారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలోనే సినిమాను రిలీజ్ చేయనున్నాం. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్‌తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు దర్శకుడు ఇస్సాకు.


ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ప్రస్తుత సమాజంలో పరువు హత్యలు ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఒకవైపు టెక్నికల్‌గా భారతదేశం అభివృద్ధి పధంలో దూసుకువెళుతున్నా.. ఇంకా కులాలు, మతాలు అంటూ అంతా కొట్టుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఈ కులాల గొడవలు, పరువు హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడీ ‘రాధా మాధవం’ కూడా ఒక పల్లెటూరిలోని ప్రేమికుల మధ్య జరిగే కథ. కులాల కుమ్ములాటల మధ్య ఇద్దరు ప్రేమికులు ఎలా నలిగిపోయారనే పాయింట్‌తో స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కిందనే విషయం.. ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. (Radha Madhavam Trailer Talk)


ఇవి కూడా చదవండి:

====================

*Nandi Awards: నంది అవార్డ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

***************************

*Mrunal Thakur: ఆ హీరోతో ఆ అవకాశం రానందుకు చాలా బాధపడ్డా..

******************************

*Dheera: ‘ధీర’ ట్రైలర్ బాగుంది.. సినిమా మంచి హిట్టవుతుంది

****************************

*Saindhav: ‘సైంధవ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌లో చిన్న మార్పు.. విడుదల ఎప్పుడంటే?

**************************

Updated Date - Feb 01 , 2024 | 06:57 PM