Pushpa 2 The Rule: ఆరు భాషల్లో ‘పుష్ప పుష్ప పుష్ప..’ మోతకి సిద్ధమా..

ABN , Publish Date - Apr 30 , 2024 | 06:03 PM

‘పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్‌..’ మోత మోగే సమయం ఆసన్నమైంది. ‘పుష్ప‌-2 ది రూల్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు టైమ్ ఫిక్సయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప‌-2 ది రూల్’. ఈ సినిమాకు సంబంధించి మే 1 నుంచి మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ మొదలెట్టబోతున్నారు. అందులో భాగంగా సాయంత్రం 5.04 నిమిషాలకు మొదటి పాటను ఆరు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

Pushpa 2 The Rule: ఆరు భాషల్లో ‘పుష్ప పుష్ప పుష్ప..’ మోతకి సిద్ధమా..
Pushpa 2 The Rule Movie Poster

‘పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్‌..’ మోత మోగే సమయం ఆసన్నమైంది. ‘పుష్ప‌-2 ది రూల్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు టైమ్ ఫిక్సయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప‌-2 ది రూల్’ (Pushpa2 The Rule). ‘పుష్ప ది రైజ్‌’ (Pushpa The Rise)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా.. నేషనల్ అవార్డ్‌ని సైతం సొంతం చేసుకుని టాలీవుడ్ సత్తా ఏంటో చూపించారు. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ (Director Sukumar) ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. ఇప్పుడందరి చూపు ‘పుష్ప’ (Pushpa)కు సీక్వెల్‌గా రాబోతోన్న ‘పుష్ప 2 ది రూల్’ పైనే ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ సినిమా నుంచి వస్తోన్న ఒక్కో అప్‌డేట్ అలా వైరల్ అవుతోంది మరి.

*Allu Ramalingaiah: అల్లుకి హాస్యనటుడిగా అవార్డు ఎప్పుడు వచ్చిందో తెలుసా?


తాజాగా ‘పుష్ప 2: ది రూల్‌’ నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. యువ సంగీత కెరటం దేవిశ్రీప్రసాద్‌ (Devi Sri Prasad) సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర పాటల్లోంచి మొదటి లిరికల్‌ వీడియో సాంగ్‌ను మే 1న సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు ఆరు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ) విడుదల చేయబోతున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా తెలుపుతూ.. ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పుష్పరాజ్ తన యాటిట్యూడ్ చూపిస్తూ.. మీరంతా సిద్ధమా అన్నట్లుగా చూస్తున్నారు. రీసెంట్‌గా ఈ పాటకు సంబంధించి విడుదల చేసిన 20 సెకండ్ల ప్రోమో (Pushpa Pushpa Song Promo) ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.


Pushpa-2.jpg

‘పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్‌..’ అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఆ ప్రోమో హింట్ ఇవ్వగా.. ఇప్పుడు వదిలిన పోస్టర్ చూస్తుంటే.. ఈ పాటతోనే పుష్పగాడి రూల్ ఎలా ఉండబోతుందో తెలియజేసేలా యూనిట్ ప్లాన్ చేసిందనేలా టాక్ మొదలైంది. ‘పుష్ప’ విజయానికి దేవిశ్రీ సంగీతం, ఆయన స్వరపరిచిన పాటలు ప్రధాన కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే సీక్వెల్‌లో కూడా మరోసారి దేవి మ్యాజిక్ చేయబోతున్నాడనేలా అప్పుడే యూనిట్‌లో టాక్ నడుస్తుండటం విశేషం. కాగా.. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల (Pushpa 2 The Rule Release Date) చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Read Latest Cinema News

Updated Date - Apr 30 , 2024 | 06:06 PM