Pushpa 2 The Rule: పుష్పరాజ్‌.. మాస్ జాత‌ర‌కు డేట్ ఫిక్స‌యింది! ఎప్పుడంటే!

ABN , Publish Date - Apr 02 , 2024 | 04:13 PM

సుకుమార్, అల్లు అర్జున్ఐ ఐకాన్ స్టార్‌ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2 . ఈ రోజు మంగ‌ళ‌వారం నాడు మేక‌ర్స్ పుష్క‌2 సినిమా నుంచి ఆప్డేట్ ఇచ్చారు.

Pushpa 2 The Rule: పుష్పరాజ్‌.. మాస్ జాత‌ర‌కు డేట్ ఫిక్స‌యింది! ఎప్పుడంటే!

సుకుమార్ (Sukumar), ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ (#Allu Arjun) కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2 (Pushpa 2 The Rule). జాతీయ‌వ్యాప్తంగా అభిమానులు ఈ చిత్రం నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడొస్తుందా అని చూస్తున్న ప్రేక్ష‌కుల ఎదురుచూపుల‌కు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) చెక్ పెట్టింది. నిన్న సోమ‌వారం రోజున నిర్మాణ‌ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌ రేప‌టి నుంచి పుష్ప మాస్‌ జాతర #PushpaMassJaathara షురూ అంటూ అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

pushpa.jpeg


ఈక్ర‌మంలో ఈ రోజు మంగ‌ళ‌వారం నాడు మేక‌ర్స్ పుష్క‌2 సినిమా నుంచి ఆప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆ రోజు టీజ‌ర్ విడుద‌ల చేయనున్న‌ట్లు మేకర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో అల్లు అర్జున్ (#Allu Arjun) ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో నిన్న‌టినుంచే #Pushpa2TheRule, #PushpaMassJaathara, #Pushpa2Teaser వంటి ట్యాగ్‌ల‌తో సోష‌ల్‌ మీడియా హోరెత్తుతోంది. అభిమానులు ఓ రేంజ్లో సామాజిక మాధ్య‌మాల‌ను షేక్ చేస్తున్నారు. దీంతో నిన్న‌టినుంచి #Pushpa2TheRule మొద‌టి స్థానంలో ట్రెండ్ అవుతోంది.

ఇదిలాఉండ‌గా.. నిన్న‌టి నుంచి పుష్ప‌2 (Pushpa 2 The Rule) లోని జాత‌ర బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లీక్ అంటూ నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. అదీగాక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జ‌న్మ‌దినం #PushpaRajKaBirthdayMonth ఉండ‌డంతో అల్లు అభిమానుల జోరు ఓ రేంజ్‌లో ఉండబోతోందనేది.. అప్పుడే తెలియవస్తుంది కూడానూ.

Updated Date - Apr 02 , 2024 | 04:37 PM