Priyamani: నేషనల్ క్రష్ తర్వాత ఈమె పేరే వినిపిస్తోంది!

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:57 PM

అటు దక్షిణాదికి చెందిన నాలుగు భాషల్లోనూ రాణిస్తూ, ఇంకో పక్క హిందీ భాషలో కూడా తనదైన శైలిలో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులని మెప్పిస్తున్న ప్రియమణి పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. 'ఆర్టికల్ 370', 'మైదాన్' రెండు హిందీ సినిమాలలో ప్రియమణి తన నటనతో మెప్పించి శెభాష్ అనిపించుకుంది.

Priyamani: నేషనల్ క్రష్ తర్వాత ఈమె పేరే వినిపిస్తోంది!
Priyamani

'యానిమల్' సినిమాతో జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్న నటి రష్మిక మందన్న. అంతకు ముందు ఆమె చేసిన 'పుష్ప' సినిమా హిందీలో పెద్ద విజయం సాధించటంతో ఆమె పేరు ఒక్కసారిగా మారుమోగింది, ఆమె 'నేషనల్ క్రష్' అయింది. ఇప్పుడు నేషనల్ క్రష్ తరువాత దక్షిణాదికి చెందిన ఇంకో నటి పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. ఆమె మరెవరో కాదు ప్రియమణి.

priyamaninational.jpg

ఎప్పుడో 21 సంవత్సరాల క్రితం 2003లో 'ఎవరే అతగాడు' అనే తెలుగు సినిమాతో చిత్రసీమలోకి ఆరంగేట్రం చేసిన ప్రియమణి తర్వాత 2007లో వచ్చిన తమిళ సినిమా 'పరుత్తివీరన్' లో కార్తీ పక్కన నటించి అందులో ఆమె చేసిన నటనకి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకొని తన ప్రతిభా పాటవాలను చాటి చెప్పింది.

priyamaninationaltwo.jpg

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం సినిమాలో తనదైన శైలిలో నిరూపించుకున్న ప్రియమణి మొదటిసారిగా 'రావణ్' సినిమాతో 2010లో హిందీలోకి ఆరంగేట్రం చేసింది. మణిరత్నం ఈ సినిమాకి దర్శకుడు. ఇందులో బాలీవుడ్ కి చెందిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, గోవిందా లతో పాటు తమిళ సూపర్ స్టార్ విక్రమ్ కూడా నటించారు. ఈ సినిమాతో హిందీలో కూడా తన పేరు నమోదు చేసుకుంది ప్రియమణి.

priyamaninationalfour.jpg

మొదటి సినిమా ఆరంగేట్రం నుంచి ఈరోజు వరకు ప్రియమణి ఎక్కడా బ్రేక్ లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ వస్తూనే వుంది. చాల తక్కువమంది నటీమణులు ఇలా ఇన్నేళ్ళపాటు వరసగా కెరీర్ లో ఎక్కడా బ్రేక్ లేకుండా సినిమాలు చేసుకుంటూ రావటం. అదీ కాకుండా ఒక తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తనకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది ప్రియమణి.

priyamaninationalthree.jpg

ఉత్తమనటిగా జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఇతర రాష్ట్ర అవార్డులు ఎన్నో గెలుచుకుంది. ఈమధ్యనే తెలుగులో 'భామా కలాపం 2' అనే వెబ్ సినిమా చేసి అక్కడ విజయం సాధిచింది. జాతీయ స్థాయిలో 'ఆర్టికల్ 370' సినిమాలో ఐఏఎస్ అధికారి రాజేశ్వరిగా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది. అలాగే ఇంకో హిందీ సినిమా 'మైదాన్' లో కూడా ఒక మంచి పాత్ర పోషించి జాతీయ స్థాయిలో ఇప్పుడు ప్రియమణి పేరు మారుమోగుతోంది అంటే ఆమె చేస్తున్న కృషి, తాను చేస్తిన్న పాత్రల పట్ల అంకితభావం, తన నటనతో అందరినీ మెప్పించడం.

priyamaninationalsix.jpg

ఇప్పుడు ప్రియమణిని వెతుక్కుంటూ పాత్రలు వస్తున్నాయి, ఆమె కోసమనే రచయితలు కొందరు తమ కథలలో పాత్రలని రాసుకుంటున్నారు అంటే ప్రియమణి పేరు ఎంతలా మారుమోగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈమధ్యనే ప్రారంభం అయిన ఒక తెలుగు సినిమాలో ఒక పాత్ర కోసం ప్రియమణి అయితేనే బాగుంటుంది అని ఆ రచయిత, దర్శకుడు ఆమెకి కథ చెప్పడానికి ముంబై వెళ్లారు వెళ్లారు అనే విషయం ఆసక్తికరం.

Updated Date - Apr 25 , 2024 | 01:58 PM