Priyamani: అలా చేస్తే... చాలా ఇస్తామన్నారు

ABN , First Publish Date - 2023-07-01T13:32:34+05:30 IST

ఎక్స్‌ప్రెషన్స్‌ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ప్రియామణి (Priyamani) తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతోపాటు హిందీ చిత్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్‌ బిగినింగ్‌ సెలెక్టివ్‌ క్యారెక్టర్స్‌తో ముందుకెళ్తున్న ఆమె పెళ్లి తర్వాత కూడా అదే పద్దతిలో నడుచుకుంటుంది. అక్కడక్కడ పాటల్లో మినహా ఎక్కడా హద్దు మీరి ఎక్స్‌పోజ్‌ చేసిన సందర్భాలు కూడా లేవు.

Priyamani: అలా చేస్తే... చాలా ఇస్తామన్నారు

ఎక్స్‌ప్రెషన్స్‌ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ప్రియామణి (Priyamani) తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతోపాటు హిందీ చిత్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్‌ బిగినింగ్‌ సెలెక్టివ్‌ క్యారెక్టర్స్‌తో ముందుకెళ్తున్న ఆమె పెళ్లి తర్వాత కూడా అదే పద్దతిలో నడుచుకుంటుంది. అక్కడక్కడ పాటల్లో మినహా ఎక్కడా హద్దు మీరి ఎక్స్‌పోజ్‌ చేసిన సందర్భాలు కూడా లేవు. పెళ్లి తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ప్రియమణి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బిజీ అయింది. ఇటీవల ‘కస్టడీ’ చిత్రంలో సీఎంగా మెప్పించింది. త్వరలో షారుక్‌ఖాన్‌ ‘జవాన్‌’లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌తో బిజీ అయిన ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ముద్దు సన్నివేశాలకు నో చెప్పడానికి కారణం చెప్పారు. (No to Bold scenes)

2136.jpg

‘పెళ్లికి ముందు కూడా నేను హద్దుదాటి చేసిన సన్నివేశాలు లేవు. పెళ్లి అయిన తర్వాత స్ర్కీన్‌పై ముద్దు సన్నివేశాలు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇప్పుడు నేను అలాంటి పాత్రలు చేయడం కరెక్ట్‌ కాదనిపించింది. అది సినిమాలో ఒక పాత్రే కావచ్చు. కానీ వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు దాని వల్ల నేను ఇబ్బంది పడతాను. ఆ తరహా సన్నివేశాలు చేస్తే నా భర్తకు నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతే కాకు తెరపై మరొక వ్యక్తిని ముద్దుపెట్టుకోవడం అంత సౌకర్యంగా కూడా అనిపించదు. 2017లో నాకు పెళ్లైంది. అప్పటి నుంచి బోల్డ్‌ సన్నివేశాలు చేయడమే మానేశా. సినిమాను అంగీకరించడానికి ముందే ఈ విషయం గురించి దర్శక-నిర్మాతలకు తెలియజేస్తా. నేను ఏ సినిమా చేసినా నా పుట్టినిల్లు, మెట్టినిల్లు వారు చూస్తారు. అలాంటి వాటి వల్ల వాళ్లు ఇబ్బంది పడతారు. అది నాకు నచ్చదు. 2021లో జీ5లో వచ్చిన ‘హిస్‌ స్టోరీ’ వెబ్‌ సీరిస్‌లో సత్యదీప్‌ మిశ్రాతో రొమాన్స్‌ సీన్‌తో పాటు ముద్దు పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయని మేకర్స్‌ చెప్పారు. కానీ వాటికి నేను ఒప్పుకోలేదు. అలాంటి ఆఫర్లు చాలానే వచ్చాయి. పారితోషికం కూడా ఎక్కువే ఇస్తామన్నారు పెళ్లి తర్వాత అలాంటి సీన్స్‌ చేయకూడదని నాకు నేను కండీషన్‌ పెట్టుకున్నా’’ అని ప్రియమణి చెప్పుకొచ్చింది.

‘ఫ్యామిలీ మ్యాన్‌’ (Familyman)వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో అడుగుపెట్టిన ప్రియమణి అటు సినిమాలు, ఇటు ఓటీటీ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో నాలుగు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ‘జవాన్‌’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. జీ5 కోసం ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్‌ చేస్తోంది.

Updated Date - 2023-07-01T13:32:34+05:30 IST