SVC58: వెంకీతో అనిల్ రావిపూడి.. రాబోయే సంక్రాంతికే రిలీజ్

ABN , Publish Date - Apr 09 , 2024 | 09:58 PM

బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌ హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి చేతులు కలిపింది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి రెండు హిలేరియస్ హిట్‌లు F2 , F3 అందించిన తర్వాత హ్యాట్రిక్ కోసం మళ్లీ జతకట్టారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.

SVC58: వెంకీతో అనిల్ రావిపూడి.. రాబోయే సంక్రాంతికే రిలీజ్
SVC58 Film Announcement

బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌ హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి చేతులు కలిపింది. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) రెండు హిలేరియస్ హిట్‌లు F2 , F3 అందించిన తర్వాత హ్యాట్రిక్ కోసం మళ్లీ జతకట్టారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.

7 బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత అనిల్ రావిపూడి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో 6వ సారి కలిసి ప్రొడక్షన్ నంబర్ 58లో అసోషియేట్ అవుతున్నారు. వీడియో ద్వారా అనౌన్స్ చేసినట్లుగా.. ఈ కొత్త చిత్రం ఒక ఎక్స్ ట్రార్డినరీ ట్రై యాంగిలర్ క్రైమ్ ఎంటర్‌టైనర్. ఇది మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది- హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్‌లెంట్ వైఫ్. థీమ్ చాలా క్రేజీ అనిపిస్తుంది. మునుపెన్నడూ లేని ఎంటర్‌టైన్‌మెంట్‌కు గ్యారెంటీ ఇస్తోంది. (Again Movie In Venkatesh and Anil Ravipudi Combo)


ఈ ముగ్గురూ ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించిన నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో మరో సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి, SVC కూడా సూపర్ హిట్ కాంబినేషన్. ఈ అనౌన్స్ మెంట్ తెలుగు ప్రేక్షకులకు పండుగ వేడుకలను రెట్టింపు చేసింది. హై బడ్జెట్‌తో హ్యూజ్ కాన్వాస్‌పై అత్యద్భుతమైన సాంకేతిక ప్రమాణాలతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘ధమాకా’ (Dhamaka) కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

Updated Date - Apr 09 , 2024 | 09:58 PM