Prasanna Vadanam: థౌజండ్ పర్సెంట్ బ్లాక్‌బస్టర్ అంటోన్న సుహాస్..

ABN , Publish Date - May 01 , 2024 | 04:49 PM

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా నటించిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వైకె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 3న విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించి.. చిత్ర విశేషాలను తెలియజేశారు.

Prasanna Vadanam: థౌజండ్ పర్సెంట్ బ్లాక్‌బస్టర్ అంటోన్న సుహాస్..
Rashi Singh, Suhas and Payal Radhakrishna

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ (Suhas) హీరోగా నటించిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వైకె (Arjun YK) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ (Manikanta JS), టిఆర్ ప్రసాద్ రెడ్డి (Prasad Reddy TR) నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 3న విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించి.. చిత్ర విశేషాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో హీరో సుహాస్ (Hero Suhas) మాట్లాడుతూ... ‘ప్రసన్న వదనం’ మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫస్ట్ కాపీ చూశాం. సినిమా థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్. ఇందులో డౌట్ లేదు. చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. నా సినిమాలు మౌత్ టాక్ వలన వెళ్తాయి కాబట్టి తొందరగా ఎవరికి కుదిరితే వారు సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి. ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుందని భావిస్తున్నాను. ప్రేక్షకులకు చాలా తృప్తిని ఇచ్చే సినిమా ఇది. సీట్ ఎడ్జ్‌లో కూర్చుని సినిమా చూస్తారు. అదిరిపోయిందని క్లాప్స్ కొడతారు. అది మాత్రం పక్కా అని అన్నారు. దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ.. ఇది దర్శకుడిగా నా మొదటి చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్స్‌లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇది యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తోన్న రియల్ కమర్షియల్ ఫిల్మ్. ఫన్, థ్రిల్, రొమాన్స్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. సుహాస్ అద్భుతంగా చేశారు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది. అందరూ వచ్చి థియేటర్స్‌లో చూడండని కోరారు.


Prasanna-vadanam.jpg

హీరోయిన్ రాశి సింగ్ (Rashi Singh) మాట్లాడుతూ.. సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా వైరల్ అయ్యింది. ఇందులో నా పాత్ర కొత్తగా వుంటుంది. సుహాస్ నేచురల్ యాక్టర్. ఆయనతో పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే3న తప్పకుండా సినిమా చూడండి. మీ అందరినీ అలరిస్తుందని తెలపగా.. మరో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) మాట్లాడుతూ.. ప్రసన్న వదనం యూనిక్ కాన్సెప్ట్‌తో అందరినీ అలరించే చిత్రం. సుహాస్‌తో వర్క్ చేయడం చాలా మంచి అనుభవం. ఇందులో పక్కంటి అమ్మాయిలా కనిపించే పాత్ర చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు ప్రసాద్ రెడ్డి, జెఎస్ మణికంఠ మాట్లాడారు.

Updated Date - May 01 , 2024 | 04:49 PM