PrasannaVadhanam: మే 3న థియేట‌ర్ల‌లోకి.. సుహాస్ సస్పెన్స్ థ్రిల్లర్’ 'ప్రసన్న వదనం'

ABN , Publish Date - Mar 19 , 2024 | 08:03 PM

సుహాస్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర రిలీజ్ డేట్ మేకర్స్ అనౌన్స్ చేశారు.

PrasannaVadhanam: మే 3న థియేట‌ర్ల‌లోకి.. సుహాస్ సస్పెన్స్ థ్రిల్లర్’  'ప్రసన్న వదనం'
prasana vadanam

యువ న‌టుడు సుహాస్ (#Suhas) హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం (Prasanna Vadhanam). స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె (arjun yk) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna), రాశి సింగ్ (Rashi Singh) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.


suha.jpeg

తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. టీజర్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం మంచి అంచనాలతో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండ‌గా, ఎస్.చంద్రశేఖరన్ డీవోపీ గా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌.

Updated Date - Mar 19 , 2024 | 08:03 PM