Prasanna Vadanam: ‘ప్రసన్న వదనం’.. ‘నిన్నా మొన్న’ లవ్లీ మెలోడీ విడుదల..

ABN , Publish Date - Apr 09 , 2024 | 07:39 PM

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది స్పెషల్‌గా ఈ సినిమా నుంచి ‘నిన్నా మొన్న’ అంటూ సాగే లవ్లీ మెలోడీని మేకర్స్ విడుదల చేశారు.

Prasanna Vadanam: ‘ప్రసన్న వదనం’.. ‘నిన్నా మొన్న’ లవ్లీ మెలోడీ విడుదల..
Prasanna Vadanam Movie Still

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ (Suhas) హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వై కె (Director Arjun Y K) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రంలోని ‘నిన్నా మొన్న’ (Ninna Monna Lyrical Song) అనే లవ్లీ మెలోడీ పాటని మేకర్స్ విడుదల చేశారు.


suhas.jpg

విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin) ఈ పాటని వినగానే ఆకట్టుకునే విధంగా కంపోజ్ చేశారు. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. శక్తిశ్రీ గోపాలన్, ఆదిత్య ఆర్.కె తమ అద్భుతమైన వోకల్స్‌తో మెస్మరైజింగ్ చేశారు. ఈ పాటలో సుహాస్, పాయల్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వుంది. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మే 3న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఎస్.చంద్రశేఖరన్ డీవోపీ‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. (Prasanna Vadanam Movie Ninna Monna Lyrical Song)


ఇవి కూడా చదవండి:

====================

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

Updated Date - Apr 09 , 2024 | 07:39 PM