Kalki 2898 AD Release Trailer: ‘కల్కి 2898 AD’ రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Jun 21 , 2024 | 09:48 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ ఫస్ట్ ట్రైలర్ మ్యాసీవ్ రెస్పాన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా నుంచి మరో ట్రైలర్‌ని శుక్రవారం మేకర్స్ వదిలారు. ఈ రిలీజ్ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతూ.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.

Kalki 2898 AD Release Trailer: ‘కల్కి 2898 AD’ రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందంటే..
Prabhas in Kalki 2898 AD

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) ఫస్ట్ ట్రైలర్ మ్యాసీవ్ రెస్పాన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా నుంచి మరో ట్రైలర్‌ని శుక్రవారం మేకర్స్ వదిలారు. ఈ రిలీజ్ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతూ.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. (Kalki 2898 AD Release Trailer)


Prabhas.jpg

ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ ట్రైలర్‌‌లో సినిమాలోని చాలా పాత్రలను పరిచయం చేశారు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’గా డేరింగ్ స్టంట్స్‌ చేస్తూ ఈ ట్రైలర్‌లోనే కాకుండా.. సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడనేది ఈ ట్రైలర్ సుస్పష్టం చేసింది. అలాగే ఉలగనాయగన్ కమల్ హాసన్ ‘యాస్కిన్’గా గుర్తించలేని డెడ్లీ అవతార్‌లో కనిపించి.. తనకు మాత్రమే సాధ్యమనేలా పెర్ఫామ్ చేశారు. ‘బుజ్జి’తో కలిసి ప్రభాస్ ‘భైరవ’గా బౌంటీ హంట్‌లో అదరగొట్టారు. దీపికా పదుకొణె ‘సుమతి’ పాత్ర‌లో ప్రెగ్నెంట్ ఉమెన్‌గా కనిపించింది. దిశా పటానీ ‘రాక్సీ’గా పవర్ ఫుల్ ప్రెజెన్స్‌‌తో ఆకట్టుకుంది. ‘కల్కి 2898 AD’లోని మూడు డిఫరెంట్ వరల్డ్స్‌ని ఈ ట్రైలర్ పరిచయం చేసింది. కాశీ, మనుగడ కోసం పోరాడుతున్న చివరిగా మిగిలిన నగరం; కాంప్లెక్స్, ఉన్నత వర్గాలచే నియంత్రించబడే ఆకాశంలో ఒక స్వర్గం; మూడోది శంబాలా, కాంప్లెక్స్ ద్వారా హింసించబడిన వారికి ఆశ్రయం అందించే ఒక ఆధ్యాత్మిక భూమి. ఓవరాల్‌గా అయితే.. ఓ అద్భుతాన్ని నాగ్ అశ్విన్ (Nag Ashwin) క్రియేట్ చేసిన ఫీల్‌ని అయితే ఈ ట్రైలర్ ఇస్తోంది.

Prabhas-2.jpg

Updated Date - Jun 21 , 2024 | 09:48 PM