Thangalaan: ‘గంగమ్మ’గా పార్వతీ తిరువోతు..

ABN , Publish Date - Apr 07 , 2024 | 04:13 PM

చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ చిత్రాన్ని కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదివారం (ఏప్రిల్ 7) టాలెంటెడ్ హీరోయిన్ పార్వతీ తిరువోతు బర్త్‌డే సందర్భంగా ‘తంగలాన్’లో ఆమె నటించిన గంగమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Thangalaan: ‘గంగమ్మ’గా పార్వతీ తిరువోతు..
Parvathy Thiruvothu in Thangalaan

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ (Thangalaan). ఈ చిత్రాన్ని కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ (Pa Ranjith) రూపొందిస్తున్నారు. పార్వతీ తిరువోతు (Parvathy Thiruvothu), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఆదివారం (ఏప్రిల్ 7) టాలెంటెడ్ హీరోయిన్ పార్వతీ తిరువోతు బర్త్‌డే సందర్భంగా ‘తంగలాన్’లో ఆమె నటించిన గంగమ్మ (Gangamma) క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. (Parvathy Thiruvothu Plays Gangamma Role in Thangalaan)

*Sasivadane: నైజాంలో ‘శశివదనే’ను రిలీజ్ చేస్తోందెవరంటే..


Parvathi.jpg

ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఇందులో ఆమె మహిళా రైతు పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. ఆమె కెరీర్‌లో బెస్ట్ రోల్ చేసిందనే అభిప్రాయాన్ని కలగజేస్తోంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్‌ను ఓ కొత్త నేపథ్యంలో, విభిన్నమైన క్యారెక్టర్‌లో దర్శకుడు పా. రంజిత్ చూపించబోతున్నారు. పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. (Thangalaan Movie)


ఇవి కూడా చదవండి:

====================

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

***********************

Updated Date - Apr 07 , 2024 | 04:15 PM