Love Mouli: న‌వ‌దీప్ 2.O ‘లవ్, మౌళి’ రిలీజ్ ఎప్పుడంటే..

ABN , Publish Date - Apr 02 , 2024 | 03:12 PM

టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తర్వాత హీరోగా, న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌‌తో క‌లిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుద‌ల చేయబోతున్నట్లుగా తాజాగా చిత్రయూనిట్ ప్ర‌క‌టించింది.

Love Mouli: న‌వ‌దీప్ 2.O ‘లవ్, మౌళి’ రిలీజ్ ఎప్పుడంటే..
Love Mouli Movie Still

టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ (Navdeep) కొంత విరామం తర్వాత హీరోగా, న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’ (Love Mouli). విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర (Avaneendra) ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌‌తో క‌లిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ నిర్మిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వ‌చ్చిన ప్రమోషనల్ కంటెంట్ వినూత్నంగా ఉండటమే కాకుండా.. అంద‌రినీ ఆక‌ట్టుకుని సినిమాపై అంచనాలను పెంచింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుద‌ల చేయబోతున్నట్లుగా తాజాగా చిత్రయూనిట్ ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అవ‌నీంద్ర (Director Avaneendra) మాట్లాడుతూ.. ఈ చిత్రంలో చాలా డిఫ‌రెంట్‌గా నవదీప్ కనిపించడంతో ఈ సినిమాను న‌వ‌దీప్ 2.Oగా పిలవడం జరిగింది. నవదీప్ అభిమానులంతా ఒక ఢిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో ఉంటుంద‌ని మంచి అంచ‌నాల‌తో ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ కంటెంట్‌లో న‌వ‌దీప్‌ను చూసిన వారంతా.. ఈసినిమాతో ఆయ‌న కొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నాడనేలా మాట్లాడుకోవడం మా టీమ్‌కు హుషారునిస్తోంది. (Love Mouli Movie Release Date)


Love-Mouli-Movie.jpg

నా లైఫ్‌లో జ‌రిగిన ప్రేమ‌క‌థ‌ల‌కు ఫ‌లిత‌మే ఈ సినిమా క‌థ‌. నేను పాన్ ఇండియా (Pan India) లెవ‌ల్‌లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. నా స్వీయ అనుభ‌వాలే ఈ సినిమా క‌థ. ఈ నెల 19న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. విభిన్న ప్రేమ‌క‌థ‌లు కోరుకునే ప్రేక్ష‌కులంద‌రికి మా ‘ల‌వ్‌, మౌళి’ మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Saranya: సీనియర్ నటి శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు

***************************

*Siddu Jonnalagadda: మెగాస్టార్‌ చిరుతో మూవీ ఛాన్స్ వచ్చింది కానీ..

************************

*Alaya F: ఈ ఆటను లాంగ్‌లైఫ్‌ కొనసాగించాలనుకుంటున్నా..

************************

Updated Date - Apr 02 , 2024 | 03:12 PM