Prathinidhi 2: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’కు న్యూ రిలీజ్ డేట్ ఫిక్సయింది..

ABN , Publish Date - May 04 , 2024 | 09:03 PM

హీరో నారా రోహిత్ అప్ కమింగ్ మూవీ ‘ప్రతినిధి 2’ చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఇంతకు ముందు ఓ డేట్‌ని ప్రకటించిన మేకర్స్ రీసెంట్‌గా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే వారం అంటే మే 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Prathinidhi 2: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’కు న్యూ రిలీజ్ డేట్ ఫిక్సయింది..
Nara Rohit in Prathinidhi 2

హీరో నారా రోహిత్ (Nara Rohit) అప్ కమింగ్ మూవీ ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఇంతకు ముందు ఓ డేట్‌ని ప్రకటించిన మేకర్స్ రీసెంట్‌గా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే వారం అంటే మే 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు (Murthy Devagupthapu) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తో కలిసి సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. సమ్మర్ హాలీడేస్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఎన్నికలను కూడా లెక్క చేయకుండా.. మే 10న (Prathinidhi 2 New Release Date) ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

*Super Star Krishna: రామ్మోహన్ కి మంచి ప్రచారం వచ్చింది, కానీ కృష్ణ సూపర్ స్టార్ అయ్యారు


Nara-rohit.jpg

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్‌, పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే విడుదలైన మాస్ సాంగ్.. రోహిత్ జీవితం గురించి జ్ఞానాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తే.. రెండవ పాట- జర్నలిస్ట్ గీతానికి కృష్ణకాంత్ ఆలోచింపజేసే సాహిత్యం అందించగా.. స్వరాగ్ కీర్తన్, జయంత్ పాడారు. ఈ పాట ఇన్స్టంట్ హిట్‌గా నిలిచి.. ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. గతంలో గ్రాండ్ సక్సెస్ అయిన ‘ప్రతినిధి’ సిరీస్ నుండి వస్తోన్న రెండవ ఫ్రాంచైజీ ‘ప్రతినిధి 2’. ఇందులో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నాడు. సిరీ లెల్లా (Siree Lella) కథానాయికగా నటిస్తుండగా.. దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువ సంగీత సంచలనం మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. (Prathinidhi 2 Movie Ready to Release)

Read Latest Cinema News

Updated Date - May 04 , 2024 | 09:03 PM