Nannante: ‘నాన్నంటే’ టీమ్‌కు ప్రముఖుల అభినందనలు

ABN , Publish Date - May 25 , 2024 | 06:26 PM

హార్ట్ ట‌చింగ్ స‌బ్జెక్టుతో, భావోద్వేగాన్ని ఆవిష్క‌రించే సన్నివేశాలతో రూపుదిద్దుకున్న సినిమా ‘నాన్నంటే’. ఏఆర్ ఫిల్మ్ బ్యానర్‌పై, నాగేశ్వర్ సమర్పణలో, నంది వెంకట్ రెడ్డి దర్శకత్వంలో, అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధ‌మైన చిత్ర ప్రీమియ‌ర్ షోను హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఈ ప్రీమియ‌ర్‌ను తిల‌కించి వారంతా చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.

Nannante: ‘నాన్నంటే’ టీమ్‌కు ప్రముఖుల అభినందనలు
Nannante Movie Special Premiere Event

హార్ట్ ట‌చింగ్ స‌బ్జెక్టుతో, భావోద్వేగాన్ని ఆవిష్క‌రించే సన్నివేశాలతో రూపుదిద్దుకున్న సినిమా ‘నాన్నంటే’ (Nannante). ఏఆర్ ఫిల్మ్ బ్యానర్‌పై, నాగేశ్వర్ సమర్పణలో, నంది వెంకట్ రెడ్డి (Nandi Venkat Reddy) దర్శకత్వంలో, అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. YSK(వైఎస్‌కె), నిహారిక చౌదరి (Niharika Chowdary), వరేణ్య ఆగ్రా, అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు, వి.కరుణాకర్ ప్ర‌ధాన‌ పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర ప్రీమియ‌ర్ షో (Nannante Special Premiere Show)ను హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో ప్ర‌ద‌ర్శించారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, మీడియా ప్ర‌తినిధులు ఈ ప్రీమియ‌ర్ షోను తిల‌కించి చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.

*Rao Ramesh: బర్త్‌డే స్పెషల్‌.. ‘పుష్ప 2’ సిండికేట్ సిద్ధప్ప లుక్ విడుదల


Nannante-Pic.jpg

ప్ర‌తి ఒక్క‌రికి నాన్న అంటే ఎంతో ఎమోష‌న్ ఉంటుందో ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా చూపించార‌ని టీమ్‌ను ప్ర‌శంసించారు. ఈ సినిమాలోని మెసెజ్ ప్ర‌తి ఒక్క యువ‌త‌కి కనెక్టు అవుతుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి లెంకల (Ashok Reddy Lenkala) మాట్లాడుతూ.. నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలని కోరుతున్నాను. అతి త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేయనున్నామని తెలిపారు. మంచికంటి వేంకటేశ్వర్లు, దుర్గా ప్రసాద్, తన్నీరు నాగేశ్వర్, ఎన్. విజయలక్ష్మి, ఎ. విజయ, అంబికా, ఏ.పూజిత రెడ్డి, మాస్టర్ ఆషు, లక్ష్మీ రామ్ తదితరులు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్రానికి డ్రమ్స్ రామ్ (Drums Ram) సంగీతం అందించారు.

Read Latest Cinema News

Updated Date - May 25 , 2024 | 07:15 PM