Rave party - Hema: హేమపై ‘మా’ ఎలాంటి చర్యలు తీసుకోనుంది?

ABN , Publish Date - May 25 , 2024 | 03:54 PM

బెంగళూరు ఫామ్‌హౌస్‌ రేవ్ పార్టీలో (Rave Party) అడ్డంగా దొరికిన వారిలో హేమ‌ పేరు కూడా ఉందని తెలిసిన తరువాత టాలీవుడ్‌లో పెద్ద దుమారం రెగింది

Rave party - Hema: హేమపై ‘మా’ ఎలాంటి చర్యలు తీసుకోనుంది?

బెంగళూరు ఫామ్‌హౌస్‌ రేవ్ పార్టీలో (Rave Party) అడ్డంగా దొరికిన వారిలో హేమ‌ పేరు కూడా ఉందని తెలిసిన తరువాత టాలీవుడ్‌లో పెద్ద దుమారం రెగింది. ముందునుంచి తనకు రేవ్ పార్టీతో సంబంధం లేదని హేమ (Actress Hema) కవరింగ్  వీడియో లు చేసినా  ఫలితం లేకపోయింది. హేమ వ్యవహారంపై మరో  టాలీవుడ్ నటి కరాటే కల్యాణి (Karate kalyani) తీవ్ర స్దాయిలో మండిపడ్టారు. నిర్మాత నట్టికుమార్ లాంటి వారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Maa Association) హేమ‌ తప్పుంటే చర్యలు తీసుకొవాలని కోరారు. హేమ  డ్రగ్స్‌ తీసుకున్నట్టు రిపోర్టు వచ్చి ,పొలీసుల దర్యాప్తు లో దోషిగా తెలితే  మూల్యం చెల్లించుకోక తప్పదు అని  మండిపడ్డారు  కరాటే కల్యాణి. గతంలో కరాటే  కల్యాణి , ఖమ్మం ఎన్టీఆర్ విగ్రహం‌పై వివాదస్పద వాఖ్యలు చేసినపుడు 'మా' ఆమెకు నోటిసు ఇచ్చిందని గుర్తు చేసింది. ఇప్పుడు  అదే  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  హేమ పై చర్యలు తీసుకుంటుందా అనే చర్చ ఇండస్ట్రీ లో నడుస్తొంది.


Hema.jpg

నిజానికి  రేవ్‌పార్టీలు, డ్రగ్‌ రాకెట్ల కేసుల్లో ప్రతిసారి టాలీవుడ్ లింక్ అంటూ వార్తలు వస్తుంటాయి.  ఒకరిద్దరు చేసే పనుల వల్ల టోటల్   పరిశ్రమకే చెడ్డ పేరు వస్తొంది ‌. అడ్డదారి తొక్కినవాళ్లు ఎవరైనా సరే  కఠిన శిక్ష  పడాల్సిన అవసరమైతే ఉందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.  క్రమశిక్షణ తప్పితే ,  నటీనటుల సంఘం నుంచి సదరు వ్యక్తుల సభ్యత్వాన్ని  తప్పించాల్సిన అవసరం ఉదంటున్నారు. గతంలో సినిమాల చిత్రీకరణ నిమిత్తం  క్రమశిక్షణ తప్పిన  వారిని కొంతకాలం పాటు  సినిమాల్లో నటించకుండా బహిష్కరించారు కూడా. ఇప్పుడు హేమ విషయంలో  మా యాక్షన్ ఏ విధంగా ఉంటుందనే పశ్న తెరమీదకు వచ్చింది. అయితే ప్రస్తుతం 'మా' అధ్యక్షుడు విష్ణు తన సినిమా 'కన్నప్ప' ప్రమోషన్స్ కోసం  విదేశాలకు వెళ్లారని.. నిజంగా హేమ దోషిగా.. పోలీసుల విచారణలో తెలితే , మా అసోసియేషన్ క్రమశిక్షణా చర్యలను తీసుకుంటారని తెలుస్తొంది. మీడియాలో వస్తున్న కధనాలు కాకుండా, పోలీసుల విచారణ ఆధారంగానే చర్యలు ఉంటాయని  మా కార్యవర్గ సభ్యులు చెబుతున్నారు. గతంలో డ్రగ్స్ ను అరికట్టాలని స్వయానా మా కమిటీ  పోలీసులను కలిసి అడిగిందని..‌కాబట్టి నటీనటుల డ్రగ్స్ వ్యవహారాలను  'మా' ఉపేక్షించేది లేదంటున్నారు. మంచు  విష్ణు దీనిపై త్వరలోనే  స్పందిస్తారని.. తాను ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత, మా ఈసి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలుస్తొంది ‌.‌ ఇందులో హేమ వ్యవహారంపై కూడా చర్చించనున్నట్లు  సమాచారం..! ఈ కేసులో హేమతో కలిపి ఇప్పటికే 86 మందికి సమన్లు పంపారు. కర్ణాటక పోలీసులు. ఈ నెల 27 లోపు పోలీసుల ముందు  హాజరుకావాలని, డ్రగ్స్ తీసుకోని పాజిటివ్ వచ్చిన వారిని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్  ప్రశ్నించే అవకాశం ఉంది. 

Updated Date - May 25 , 2024 | 04:07 PM