Family Star: ‘నందనందనా..’ విజయ్ దేవరకొండ సినిమా సాంగ్ ప్రోమో

ABN , Publish Date - Feb 06 , 2024 | 06:55 PM

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. రీసెంట్‌గానే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ పార్ట్ 1 రిలీజ్ కోసం లాక్ చేసిన డేట్‌‌కే ఈ సినిమాను థియేటర్లలోకి దించేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించినట్లుగా తెలుపుతూ.. ఫస్ట్ సింగిల్‌ ‘నందనందనా’ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.

Family Star: ‘నందనందనా..’ విజయ్ దేవరకొండ సినిమా సాంగ్ ప్రోమో
Family Star Movie Still

స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). రీసెంట్‌గానే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) పార్ట్ 1 రిలీజ్ కోసం లాక్ చేసిన డేట్‌‌కే ఈ సినిమాను థియేటర్లలోకి దించేందుకు నిర్మాత దిల్ రాజు (Dil Raju) ప్లాన్ చేశారు. అఫీషియల్‌గా విడుదల తేదీ ఏప్రిల్ 5 అని ప్రకటించారు. ఇక ఎప్పుడైతే రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందో.. చిత్రయూనిట్ అందుకు అనుగుణంగా ప్రమోషన్స్‌పై కూడా దృష్టి పెట్టింది. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించినట్లుగా తెలుపుతూ.. ఫస్ట్ సింగిల్‌ ‘నందనందనా’ ప్రోమోను (Nandanandanaa Lyrical Promo) మేకర్స్ విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన ఫస్ట్ సింగిల్ ‘నందనందనా..’ పుల్ లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు.

తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జాయ్ ఫుల్ మూడ్‌లో కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల (Parasuram Petla) సూపర్ హిట్ మూవీ ‘గీత గోవిందం’లో ఛాట్ బస్టర్ సాంగ్ ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...’కు వర్క్ చేసిన లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ సిధ్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాంబోలో ఈ ‘నందనందనా..’ సాంగ్ వస్తుండటంతో ఈ పాటపై మంచి బజ్ క్రియేటైంది. ప్రోమో కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది.


Vijay-Deverakonda.jpg

ఈ ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైన ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

====================

*Kavya Thapar: గోపీచంద్, శ్రీను వైట్ల కాంబో మూవీ టైటిల్ లీక్ చేసిన ‘ఈగల్’ భామ

************************

*Sai Pallavi: సాయి పల్లవి సినిమా రీ రిలీజ్.. లేడీ పవర్ స్టార్ అని అనేది అందుకే..

*****************************

*Super Star: ఇక ‘సూపర్‌స్టార్‌’ ట్యాగ్‌ చర్చకు తెరపడినట్టేనా? విజయ్ అభిమానులకు హితబోధ

*****************************

*Sudigali Sudheer: అయ్యో పాపం సారూ.. ఇట్టా బుక్కయ్యాడు

***************************

Updated Date - Feb 06 , 2024 | 06:55 PM