Music Shop Murthy: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది..

ABN , Publish Date - May 25 , 2024 | 08:52 PM

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. మంచి కాన్సెప్ట్‌, కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Music Shop Murthy: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది..
Music Shop Murthy Movie Still

అజయ్ ఘోష్ (Ajay Ghosh), చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy). మంచి కాన్సెప్ట్‌, కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు (Siva Paladugu) ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

*Love Me Movie Review: వైష్ణవి చైతన్య, ఆశిష్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే...

ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇంకో మూడు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు ఎమోషనల్ ట్రీట్‌ను ఇచ్చేందుకు రాబోతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబి, టిల్లు స్క్వేర్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ (Dheeraj Mogilineni Entertainment) ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి.


Ajay-Ghosh-Music-Shop-Murth.jpg

ఈ చిత్రంలో అజయ్ ఘోష్ డీజే కావాలనుకునే మ్యూజిక్ షాప్ యజమానిగా కనిపించనున్నారు. చాందిని చౌదరి తన లక్ష్యాన్ని సాధించడానికి అతనికి సహాయం చేసే ఇన్‌స్పైరింగ్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ బెజుగం కెమెరామెన్‌గా పని చేయగా, పవన్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు. (Music Shop Murthy Release Date)

Read Latest Cinema News

Updated Date - May 25 , 2024 | 08:52 PM