Music Shop Murthy: ‘అంగ్రేజీ బీట్’తో వచ్చిన అజయ్ ఘోష్.. ఇది వేరే లెవల్ అంతే!

ABN , Publish Date - May 18 , 2024 | 04:17 PM

ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా.. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ‘అంగ్రేజీ బీట్’ అంటూ అదిరిపోయే బీటున్న లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Music Shop Murthy: ‘అంగ్రేజీ బీట్’తో వచ్చిన అజయ్ ఘోష్.. ఇది వేరే లెవల్ అంతే!
Ajay Ghosh in Music Shop Murthy

ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్ ప్రధానంగా తెరకెక్కుతోన్న చిత్రాలకు పట్టం కడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఓటీటీలు హవా మొదలైనప్పటి నుండి కొత్త కంటెంట్‌కే ప్రేక్షకులు ప్రాధాన్యతను ఇస్తున్నారు. అలా ఓ కంటెంట్ బేస్డ్ మూవీనే ఇప్పుడు రాబోతుందని అంటున్నారు.. ఫ్లై హై సినిమాస్ నిర్మాతలు. ఈ బ్యానర్‌పై అజయ్ ఘోష్ (Ajay Ghosh), చాందినీ చౌదరి (Chandini Chowdary)లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy).

*Manam: ‘మనం’కు పదేళ్ళు పూర్తి.. మే 23న మరొక్కసారి!


శివ పాలడుగు (Siva Paladugu) ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా.. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘అంగ్రేజీ బీట్’ అంటూ అదిరిపోయే బీటున్న లిరికల్ సాంగ్‌ (Angrezi Beat Lyrical Song)ని మేకర్స్ విడుదల చేశారు.


Ajay-Ghosh-Music-Shop-Murth.jpg

‘అంగ్రేజీ బీట్’ (Angrezi Beat) అంటూ సాగే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో డీజే మూర్తిగా అజయ్ ఘోష్ ఆహార్యం, వేసిన స్టెప్పులు, కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. వేరే లెవల్ అంతే. పవన్ లిరిక్స్, బాణీలు ఈ పాటను ప్రత్యేకంగా మార్చేశాయి. మాంచి హుషారైన బీటుతో వచ్చిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. వచ్చే నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అమితంగా ఎంటర్‌టైన్ చేసే చిత్రంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను క్రియేట్ చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. (Angrezi Beat Lyrical Song Released From Music Shop Murthy)

Read Latest Cinema News

Updated Date - May 18 , 2024 | 04:17 PM