Music Shop Murthy: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’గా యంగ్ హీరోయిన్‌తో అజయ్ ఘోష్.. పోస్టర్ వైరల్

ABN , Publish Date - Feb 04 , 2024 | 01:31 PM

నటుడు అజయ్ ఘోష్ పేరు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అవుతుందో తెలియంది కాదు. ఆయన విలన్‌గా, కమెడియన్‌గా.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా.. తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఓ డిఫరెంట్ కంటెంట్‌ చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’తో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు యంగ్ హీరోయిన్‌తో రెడీ అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ వదిలారు.

Music Shop Murthy: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’గా యంగ్ హీరోయిన్‌తో అజయ్ ఘోష్.. పోస్టర్ వైరల్
Music Shop Murthy Poster

కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌ను ప్రస్తుతం ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీని రెడీ చేస్తున్నారు నిర్మాత హర్ష గారపాటి. నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh) పేరు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అవుతుందో తెలియంది కాదు. ఆయన విలన్‌గా, కమెడియన్‌గా.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా.. తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఓ డిఫరెంట్ కంటెంట్‌ చిత్రంతో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అయ్యారు. చాందినీ చౌదరి (Chandini Chowdary), అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలలో శివ పాలడుగు (Siva Paladugu) రూపొందించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy). ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి (Harsha Garapati) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.


Ajay-Ghosh.jpg

ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై క్రేజ్ ఏర్పడేలా చేస్తోంది. అజయ్ ఘోష్ పాత్ర ఇందులో పూర్తి వినోదాత్మకంగా ఉండేలా అనిపిస్తోంది. అజయ్ ఘోష్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ చూస్తుంటే.. అసలు చాందినీ చౌదరి పాత్రకు, అజయ్ ఘోష్ పాత్రతో ఉండే కనెక్షన్ ఏంటి? అసలు ఈ సినిమా పాయింట్ ఏంటి? వీరిద్దరి కథ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా ఈ పోస్టర్‌ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. పవన్ సంగీతం, శ్రీనివాస్ బెజుగమ్ కెమెరా, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ను త్వరలోనే మేకర్లు ప్రకటిస్తామని తెలిపారు. (Music Shop Murthy First Look Out)


ఇవి కూడా చదవండి:

====================

*హీరో విశాల్‌ - లైకా ప్రొడక్షన్ ఖాతాల ఆడిట్‌: హైకోర్టు ఆదేశం

*************************

*Guntur Kaaram: అఫీషియల్‌‌గా ‘గుంటూరు కారం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్.. విశేషమేమిటంటే?

************************

*Teja Sajja: మహేశ్ బాబుని ‘మగేశ్’ అనేవాడిని.. అప్పుడాయన ఏమనేవారంటే..

*************************

*Chiranjeevi: పద్మవిభూషణుడికి ఉపాసన అభినందన సభ.. హాజరైన తెలంగాణ సీఎం

*****************************

Updated Date - Feb 04 , 2024 | 01:31 PM