Megastar Chiranjeevi: అప్పుడు ‘హనుమాన్’కి.. ఇప్పుడు ‘భజే వాయు వేగం’కి..!

ABN , Publish Date - Apr 20 , 2024 | 05:14 PM

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న ‘భజే వాయు వేగం’ సినిమా టీజర్‌ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ‘విశ్వంభర’ సినిమా సెట్‌లో ఈ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ టీజర్‌తో పాటు టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా, ఇంప్రెసివ్‌గా ఉందని చెబుతూ.. టీమ్‌కు బెస్ట్ విశెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ టీజర్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Megastar Chiranjeevi: అప్పుడు ‘హనుమాన్’కి.. ఇప్పుడు ‘భజే వాయు వేగం’కి..!
Bhaje Vaayu Vegam Teaser Launch at Vishwambhara Sets

తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ (HanuMan) సినిమాకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఎలాంటి సపోర్ట్ ఇచ్చారో తెలియంది కాదు. ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా అద్భుతంగా ఆడుతుందని, థియేటర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని.. టీమ్‌కు ఆశీస్సులు అందించారు. ఆ తర్వాత ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని సాధించడమే కాకుండా.. రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్లీ మరో యంగ్ హీరో సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ అందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ (UV Concepts) బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) నటిస్తున్న ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) సినిమా టీజర్‌ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా సెట్‌లో ఈ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ టీజర్‌తో పాటు టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా, ఇంప్రెసివ్‌గా ఉందని చెప్పారు.

*VIjay Antony: నా సినిమాని మరో 'అన్బే శివం' చేయొద్దు, 'ఎక్స్' లో పోస్ట్ వైరల్


ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘యూవీ కాన్సెప్ట్స్‌లో విక్కీ నిర్మాతగా, దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చంద్రపు రూపొందిస్తున్న ‘భజే వాయు వేగం’ సినిమా టీజర్, టైటిల్ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. నా అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. నా అభిమాని హీరోగా ఓ మంచి సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రశాంత్ రెడ్డి వంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ టాలీవుడ్‌కు రావాలి. ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ ఎంతమంది కొత్త కాన్సెప్ట్స్‌తో వస్తే అంత ఫ్రెష్‌గా మన తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు సాగుతుంది. యంగ్ డైరెక్టర్స్‌ను నేను ఎప్పుడూ ఆహ్వానిస్తుంటాను. ఈ సినిమా టీజర్ చూస్తుంటే తండ్రీ కొడుకుల మధ్య మంచి ఎమోషన్‌తో సాగే సినిమా అనిపిస్తోంది. యాక్షన్ బాగుంది. ఈ సినిమా స్టోరీ నాకు తెలిసినా ఇంతకంటే ఎక్కువ లీక్ చేయాలనుకోవడం లేదు. ‘భజే వాయు వేగం’ సినిమా టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. (Megastar Chiranjeevi About Bhaje Vaayu Vegam)


Megastar.jpg

టీజర్ (Bhaje Vaayu Vegam Teaser) విషయానికి వస్తే.. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభిస్తారు. మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్ అంతా ఇదే టాస్క్ మీద ఫోకస్ చేస్తుంటుంది. మరోవైపు కార్తికేయ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూనే తండ్రితో ఆయనకున్న ఎమోషనల్ బాండింగ్‌ను ఈ టీజర్‌లో చక్కగా చూపించారు. రాహుల్ టైసన్ క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒకడుంటాడు. వాడి కోసం ఏం చేయడానికైనా మనం వెనకాడం, నా లైఫ్‌లో అది మా నాన్న అని కార్తికేయ చెప్పిన డైలాగ్.. అలాగే ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు ఈ టీజర్‌కు హైలైట్. టీజర్‌లో హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో పాటు కార్తికేయ గుమ్మకొండ ఎనర్జిటిక్‌గా కనిపించారు. అన్ని ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందినట్లు టీజర్‌తో తెలుస్తోంది. కాగా.. కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ (Ishwarya Menon) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ (Rahul Tyson) కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు.

Chiru.jpg

Updated Date - Apr 20 , 2024 | 05:14 PM