Vishwambhara: గుంటూరు కారం ఇంట్లో...

ABN , Publish Date - Feb 29 , 2024 | 10:08 AM

మెగాస్టార్‌ చిరంజీవి అమెరికా విహారం నుంచి తిరిగొచ్చి షూటింగ్‌తో బిజీ అయ్యారు. 'విశ్వంభర' సెట్‌లో ఆటా పాటతో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో శివార్లో నెలకొల్పిన ప్రత్యేకమైన సెట్‌లో జరుగుతోంది.

Vishwambhara: గుంటూరు కారం ఇంట్లో...


మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అమెరికా విహారం నుంచి తిరిగొచ్చి షూటింగ్‌తో బిజీ అయ్యారు. 'విశ్వంభర' (Vishwambhara) సెట్‌లో ఆటా పాటతో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 'గుంటూరు కారం' హౌస్‌లో జరుగుతోంది. 'విశ్వంభర' సినిమాకు తగ్గట్టు ఆ ఇంటిలో కొన్ని మార్పులు చేశారని తెలిసింది. చిరంజీవి, త్రిషతో పాటు మరికొంత మంది ప్రధాన తారాగణం పాల్గొనగా... ఓ పాటను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. శోభి డాన్స్ కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. బీయాండ్‌ యూనివర్స్‌ కాన్సెప్ట్‌తో ఫాంటసీ అడ్వంచర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. 

చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. స్టాలిన్  తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో  వస్తున్న చిత్రమిది. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌  నిర్మిస్తున్నారు. ఇషాచావ్లా, సురభి ఇతర పాత్రల్లో కనిపిస్తారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

Updated Date - Feb 29 , 2024 | 02:52 PM