Karthikeya: భజే వాయు వేగం టీజర్  రెడీ

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:46 PM

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న సినిమా 'భజే వాయు వేగం'. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Karthikeya: భజే వాయు వేగం టీజర్  రెడీ

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ (UV concepts) బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ (karthkeya gummakonda) నటిస్తున్న సినిమా 'భజే వాయు వేగం' (Bhaje vaayuvegam) ఐశ్వర్య మీనన్ (Aishwarya menon) హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి (Prasanth reddy) దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం టీజర్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. శనివారం 2.25 నిమిషాలకు టీజర్  విడుదల చేయబోతున్నట్లు  చేయబోతున్నట్లు వెల్లడించారు.

Kartikeya.jpg ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో టీజర్ కూడా బాగుంటుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. "భజే వాయు వేగం" సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్  చేస్తామని నిర్మాత తెలిపారు. కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు నటిస్తున్నారు. 

Updated Date - Apr 20 , 2024 | 09:29 AM