మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ ఇదే, అదిరింది కదా

ABN, Publish Date - Apr 22 , 2024 | 06:02 PM

ఇంతకు ముందు ఏ సినిమాలో కూడా లేనట్టుగా ఇప్పుడు జుట్టుని బాగా పొడుగ్గా పెంచిన మహేష్ బాబు, హైదరాబాద్ ఐపీఎల్ టీము సబ్యులని కలిసినప్పుడు తీయించుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సినిమా లుక్ ఇదే అని నెటిజన్స్ వ్యాఖ్యలు. అదిరిపోయే లుక్ లో మహేష్ బాబు

Mahesh Babu's latest look

అగ్ర దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు జతకడుతున్న సినిమాకి ఎప్పటినుంచే హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా ఇంకా అధికారికంగా ఏమీ మొదలుపెట్టకపోయినా, ఈ సినిమా గురించి ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే వుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు ఎలా కనపడబోతున్నారో అనే విషయం కూడా బయటకి వచ్చింది.

మహేష్ బాబు ప్రముఖ క్రికెట్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ని కలిశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కి మయాంక్ అగర్వాల్ ఆడుతున్న నేపథ్యంలో మహేష్ బాబు ని ఆ టీము సభ్యులు కొంతమంది కలిసినట్టు తెలుస్తోంది. అందులో కొందరు మహేష్ బాబు తో ఫోటోలు కూడా తీయించుకొని అవి తమ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఇందులో మహేష్ బాబు ఒక కొత్త లుక్ లో అదిరిపోయే గెటప్ తో కనపడుతున్నారు.

ఇంకేముంది నెటిజన్స్ ఇదే రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ అని చెపుతున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వున్నాయి. ఈ సినిమాకి ఇంకా ఎటువంటి పేరు పెట్టలేదు కానీ ప్రస్తుతానికి #SSMB29 అని పిలుస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ అందిస్తున్నారు. ఈ సినిమా మేలో మొదలవ్వొచ్చు అని ఒక వార్త నడుస్తోంది.

Updated Date - Apr 22 , 2024 | 06:21 PM