మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kousalya Tanaya Raghava: రిలీజ్‌కు సిద్ధమైన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్

ABN, Publish Date - Apr 09 , 2024 | 08:51 PM

ఫీల్ గుడ్, వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందనే విషయం తెలియంది కాదు. అలాంటి ఓ మంచి గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ‘కౌసల్య తనయ రాఘవ’ అనే మూవీ రాబోతోంది. ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కుటుంబమంతా కలిసి చూసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ ప్రకటించారు.

Kousalya Tanaya Raghava Movie Still

ఫీల్ గుడ్, వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందనే విషయం తెలియంది కాదు. అలాంటి ఓ మంచి గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ‘కౌసల్య తనయ రాఘవ’ (Kousalya Tanaya Raghava) అనే మూవీ రాబోతోంది. ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కుటుంబమంతా కలిసి చూసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక మనిషికి మనిషి ఇచ్చే విలువల మీద, ఒక మనసుకి ఇంకొక మనసు మీద ఉండే నిజమైన ప్రేమ మీద 1980వ సంవత్సరం నేపథ్యంలో జరిగే ఓ అందమైన కుటుంబ ప్రేమ కథే ఈ ‘కౌసల్య తనయ రాఘవ’ అని అంటున్నారు మేకర్స్. (Kousalya Tanaya Raghava Ready to Release Date Annonuncement)

*Nagabandham: అభిషేక్ పిక్చర్స్‌లో మ్యాజిస్టిక్ ఎడ్వంచర్


అడపా రత్నాకర్ నిర్మిస్తున్న ఈ మూవీకి స్వామి పట్నాయక్ (Swamy Patnaik) కథ, కథనం, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన పాటలు మంచి స్పందనను రాబట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ‘కౌసల్య తనయ రాఘవ’ మూవీ.. షూటింగ్ అంతా పాలకొండ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ని మేకర్లు ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి రాజేష్ రాజ్ తేలు సంగీతమందించగా.. యోగి రెడ్డి కెమెరామెన్‌గా పని చేశారు. శ్రీ కృష్ణ ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. (Kousalya Tanaya Raghava Telugu Movie)


ఇవి కూడా చదవండి:

====================

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

Updated Date - Apr 09 , 2024 | 08:58 PM