Nagabandham: అభిషేక్ పిక్చర్స్‌లో మ్యాజిస్టిక్ ఎడ్వంచర్

ABN , Publish Date - Apr 09 , 2024 | 08:30 PM

ఉగాది శుభ సందర్భంగా అభిషేక్ పిక్చర్స్ తమ గ్రాండ్ వెంచర్ టైటిల్‌‌ను ఓ పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ చిత్రానికి ‘నాగబంధం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. ఈ ఇంట్రడక్షన్ వీడియో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఆకట్టుకునే సౌండ్‌ట్రాక్, అద్భుతమైన విజువల్స్‌ మెస్మరైజ్ చేస్తున్నాయి. అలాగే VFX వర్క్ ఎక్స్‌ట్రార్డినరీ‌గా వుంది.

Nagabandham: అభిషేక్ పిక్చర్స్‌లో మ్యాజిస్టిక్ ఎడ్వంచర్
Nagabandham Movie Still

అభిషేక్ నామా (Abhishek Nama) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘గూఢచారి’, ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ వంటి కొన్ని సంచలనాత్మక చిత్రాలను రూపొందించిన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన అభిషేక్ నామా.. ఇప్పుడు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని పునర్నిర్వచించేలా ఒక మ్యాజిస్టిక్ ఎడ్వంచర్‌ని రూపొందిస్తున్నారు. థండర్ స్టూడియోస్‌తో కలిసి అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం. 9ని మధుసూధన్ రావు (Madhusudhan Rao) నిర్మిస్తున్నారు. ‘డెవిల్‌’ (Devil)తో దర్శకత్వ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్న అభిషేక్ నామా ఈ భారీ చిత్రానికి మెగాఫోన్ పట్టనున్నారు. ఆధ్యాత్మిక, సాహసోపేత అంశాలతో కూడిన పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను ఈ సినిమా కోసం రెడీ చేశారు అభిషేక్ నామా. దేవాన్ష్ నామా (Devansh Nama) ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, దేవ్ బాబు గండి (బుజ్జి) సహ నిర్మాత.

*Prasanna Vadanam: ‘ప్రసన్న వదనం’.. ‘నిన్నా మొన్న’ లవ్లీ మెలోడీ విడుదల..


ఉగాది శుభ సందర్భంగా అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures) తమ గ్రాండ్ వెంచర్ టైటిల్‌‌ను ఓ పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ చిత్రానికి ‘నాగబంధం’ (Nagabandham) అనే టైటిల్‌ ఖరారు చేశారు. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. ఈ ఇంట్రడక్షన్ వీడియో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఆకట్టుకునే సౌండ్‌ట్రాక్, అద్భుతమైన విజువల్స్‌ మెస్మరైజ్ చేస్తున్నాయి. అలాగే VFX వర్క్ ఎక్స్‌ట్రార్డినరీ‌గా వుంది. KGF ఫేమ్ అవినాష్ (Avinash) పోషించిన మిస్టీరియస్ అఘోరి పాత్రను పరిచయం చేస్తూ, వీడియో అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.


Abhishek-Pictures.jpg

ఇది లీడ్ యాక్టర్ కోసం, విష్ణువు నిధి కోసం థ్రిల్లింగ్ అన్వేషణకు సంబంధించిన క్యురియాసిటీని పెంచుతోంది. దర్శకుడు అభిషేక్ నామా దర్శకత్వంలో, మధుసూధన్ నిర్మాణంలో అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ హై-బడ్జెట్ ప్రొడక్షన్ మ్యాజికల్, సీక్రెట్, సాహసాల ప్రపంచంలోకి లీనమయ్యే ప్రయాణానికి హామీ ఇస్తుంది. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ డీవోపీ కాగా, అభే సంగీత దర్శకుడు. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ ‘నాగబంధం’ను 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. (Nagabandham Title Glimpse)


ఇవి కూడా చదవండి:

====================

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

Updated Date - Apr 09 , 2024 | 08:30 PM