Kaliyugam Pattanam Lo: ‘కలియుగం పట్టణంలో’ తాజా అప్డేట్ ఇదే..

ABN , Publish Date - Jan 02 , 2024 | 08:46 PM

నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె. చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

Kaliyugam Pattanam Lo: ‘కలియుగం పట్టణంలో’ తాజా అప్డేట్ ఇదే..
Kaliyugam Pattanam Lo Movie Poster

న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్లు ఇప్పుడు కొత్త జానర్లలో సినిమాలు చేస్తూ.. కొత్త మేకింగ్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. నూతన దర్శకులు స్క్రీన్ మీద వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్టులతో వచ్చే చిత్రాలు ఇప్పుడు ఆడియెన్స్‌ను బాగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఓ కొత్త కథాంశంతోనే ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo) అనే చిత్రం రాబోతోంది. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ మూవీలో విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయుషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె. చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర అప్డేట్‌ని నిర్మాతలు తెలియజేశారు. (Kaliyugam Pattanam Lo Update)


Vishva-Karthikeya.jpg

వారు మాట్లాడుతూ.. ‘‘తొలి ప్రయత్నంగా ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు రమాకాంత్ రెడ్డి ప్రయోగం చేశారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. సినిమా బాగా రావడంతో అంతా హ్యాపీగా ఉన్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ వంటి టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల వంటి వారు పాటలకు సాహిత్యాన్ని అందించారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నాం’’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Teja Sajja: సూపర్ స్టార్‌‌కి పోటీగా కాదు.. పాటుగా.. అంతే!

****************************

*Mangai: తెలుగమ్మాయ్ ప్రధాన పాత్రలో తమిళ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల

************************

*Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ దర్శకుడు వదిలిన సర్క్యులర్ చూశారా..

****************************

*SV Ranga Rao: ముత్యాల సుబ్బయ్యకు ముచ్చెటమలు పట్టించిన ఎస్వీఆర్.. విషయం ఏమిటంటే?

************************

Updated Date - Jan 02 , 2024 | 08:46 PM