Kajal Agarwal: కాజల్ అగర్వాల్ 'సత్యభామ' విడుదల తేదీ ఖరారు

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:41 PM

బాలయ్యతో 'భగవంత్ కేసరి' లో ఒక వెరైటీ పాత్ర చేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పోయీసాఫీసరు గా 'సత్యభామ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వచించిన ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ 'సత్యభామ' విడుదల తేదీ ఖరారు
Kajal Aggarwal from Satyabhama

కాజల్ అగర్వాల్ పోలీసు ఆఫీసర్ ప్రధాన పాత్రగా 'సత్యభామ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా అన్ని హంగులూ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం అయింది. ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు, కాగా బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. (Kajal Aggarwal is playing a police officer in Satyabhama and the film is releasing on May 17) ఈ సినిమాని మే 17న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర నిర్వాహకులు ఈరోజు ప్రకటించారు. ఇందులో నవీన్ చంద్ర ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అతని పాత్ర పేరు అమరేందర్, సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర అని చెపుతున్నారు.

kajalagarwalsatyabhama.jpg

ఈ చిత్రానికి ఇంకో విశేషం ఏంటంటే, అడివి శేష్ తో 'మేజర్' అనే చిత్రానికి దర్శకత్వం వహించి విజయం సాధించిన శశికిరణ్ తిక్క ఈ 'సత్యభామ' చిత్రానికి సమర్పకులుగా ఉండటమే కాకుండా, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ సినిమా నేపధ్యం ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెపుతున్నారు.

kajalagarwalone.jpg

ఈ సినిమా విడుదల తేదీ ప్రకటన కోసం ఒక ప్రత్యేక వీడియోని రూపొందించారు. అందులో క్రైమ్ సీన్ నుంచి రికవరీ చేసిన గన్ విడి పార్ట్స్ లోడ్ చేసి కాజల్ షూట్ చేయగా, అది క్యాలెండర్ లో మే 17 డేట్ ను టార్గెట్ చేస్తూ దూసుకెళ్తుంది. ఇలా ఈ సినిమా విడుదల తేదీని వైవిధ్యంగా ప్రకటించారు నిర్వాహకులు. ఇందులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక ముఖ్యపాత్రలో కనపడనున్నారు.

Updated Date - Apr 22 , 2024 | 04:41 PM