Kajal Aggarwal: బాలయ్య ఇలాంటి కథ చేసినందుకు నేను హ్యాపీ!

ABN , First Publish Date - 2023-10-17T16:59:26+05:30 IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా.. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌లో రూపొందిన చిత్రం ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

Kajal Aggarwal: బాలయ్య ఇలాంటి కథ చేసినందుకు నేను హ్యాపీ!
Kajal Aggarwal

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా.. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌లో రూపొందిన చిత్రం ‘భగవంత్ కేసరి' (Bhagavanth Kesari). కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు, ట్రైలర్ హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

ఈ సినిమాలో మీరు చేసిన కాత్యాయని (Katyayani) పాత్ర ఎలా వుంటుంది?

కాత్యాయని ఒక సైకాలజిస్ట్. చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్. అలాగే నా పాత్ర చాలా సరదాగా వుంటుంది. నా పాత్రలో చాలా హ్యుమర్ వుంటుంది. ఈ పాత్ర చేస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేశాను.

ఇది స్త్రీశక్తి, మహిళా సాధికారతని చాటే కథని తెలుస్తుంది. ఇలాంటి కథలో భాగం కావడం ఎలా వుంది?

ఈ కథని ఎంచుకోవడానికి కారణం ఇదే. ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ఆడపిల్లని ధైర్యంగా పెంచడం, అలాగే మహిళా సాధికారత గురించి మాట్లాడే అవసరం ప్రస్తుత సమాజంలో వుంది. మన సూపర్ స్టార్స్ ఇలాంటి కథలు చెప్పడానికి ముందుకు రావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. నా పాత్ర ఎలా వుంది? అని కాకుండా.. ఈ కథ చెప్పాల్సిన అవసరం వుందని చేసిన సినిమా ఇది. బాలకృష్ణగారు ఈ కథ ఓకే చేసినందుకు నేను హ్యాపీ. ఇలాంటి మంచి సందేశం ప్రజల్లోకి వెళ్ళాలి. అలాంటి ఓ గొప్ప సినిమాలో భాగం కావడం ఆనందం వుంది.


Kajal-1.jpg

బాలకృష్ణ (Balakrishna)తో వర్క్ చేయడం ఎలా అనిపించిది?

ఆయన చాలా స్వీట్ అండ్ ఫ్రెండ్లీ. ఆయనకు గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ వుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చాలా నిజాయితీ గల మనిషి. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వున్నాయి. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.

అనిల్ రావిపూడి (Anil Ravipudi) రైటింగ్, డైరెక్షన్ స్టైల్ గురించి..?

అనిల్ రావిపూడి సినిమాలని చాలా ఇష్టపడతాను. ఆయన టైమింగ్, సెన్సాఫ్ డైరెక్షన్ చాలా బావుంటాయి. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలని చాలా ఎంజాయ్ చేశాను. ‘భగవంత్ కేసరి'లో ఆయన స్టైల్ వినోదం ఉంటూనే ఒక బలమైన సందేశం కూడా వుంటుంది. ఇది తనకి చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుంది.

శ్రీలీల‌ (Sreeleela)తో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది?

శ్రీలీల చాలా టాలెంటెడ్. చాలా ఎనర్జిటిక్‌గా వుంటుంది. సెట్స్‌లో చాలా యాక్టివ్‌గా వుంటుంది. మంచి పాత్రలు చేయాలనే తపన తనలో వుంది. ఇందులో తను చేసిన విజ్జి పాప పాత్ర కథలో చాలా కీలకం. ఖచ్చితంగా ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకొస్తుంది. తనకు చాలా మంచి భవిష్యత్ వుంటుంది.


Kajal-2.jpg

తమన్ (Thaman S) మ్యూజిక్ గురించి?

తమన్ చాలా వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే పాటలు చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. నేపధ్య సంగీతం చాలా గ్రాండ్‌గా వుంటుంది. థియేటర్స్‌లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

షైన్ స్క్రీన్స్ నిర్మాతల గురించి?

హరీష్, సాహూ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎక్కడా రాజీపడకుండా సినిమాని చాలా గ్రాండ్ తీశారు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌లో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

‘భగవంత్ కేసరి' ఎలా ఉండబోతుంది?

‘భగవంత్ కేసరి' పవర్ ప్యాక్డ్ మూవీ. ఎమోషన్స్, యాక్షన్ చాలా అద్భుతంగా వుంటాయి. బలమైన సందేశం కూడా వుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

కొత్తగా చేస్తున్న సినిమాలు?

‘సత్యభామ’ (Satyabhama) సినిమా పూర్తి చేయాలి. అలాగే కమల్ హాసన్‌గారి ‘ఇండియన్ 2’ (Indian2)లో చాలా డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా వున్నాయి.


Kajal-3.jpg

ఇవి కూడా చదవండి:

============================

*Leo: ‘లియో’ ఫీవర్‌.. 9కి వద్దు.. ఉదయం 4, 7 గంటల ఆట కోసం పట్టు

*****************************************

*Japan: దీపావళికి థియేటర్లలోకి.. ఈలోపే పోస్టర్స్‌తో పేల్చేస్తున్నారు

*****************************************

*Sona: ఆ చిన్న పొరపాటు వల్లే నన్ను శృంగార తారను చేశారు

***************************************

*Akira Nandan: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈవెంట్‌లో ఈ పేరే హాట్ టాపిక్..

***********************************

*Mistake: ఓటీటీలో ‘మిస్టేక్’కు మెరుపులాంటి స్పందన..

***********************************

Updated Date - 2023-10-17T17:10:53+05:30 IST