Jack: సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబో ఫిల్మ్ టైటిల్ ఇదే..

ABN , Publish Date - Feb 07 , 2024 | 01:28 PM

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా, స్క్రీన్ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పలు విభాగాల్లో తన సత్తాను చాటుకుంటూ.. తన మల్టీటాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజును పురస్కరించుకుని.. తాజాగా ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘జాక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Jack: సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబో ఫిల్మ్ టైటిల్ ఇదే..
Jack Movie Poster

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Star Boy Siddhu Jonnalagadda) హీరోగా, స్క్రీన్ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పలు విభాగాల్లో తన సత్తాను చాటుకుంటూ.. తన మల్టీటాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. డీజే టిల్లు సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎంతో సెలెక్టివ్‌గా సినిమా కథలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో పాటు బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ (BVSN Prasad) నిర్మిస్తున్న.. ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేస్తూ.. తాజాగా మేకర్స్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. (#HBDSidduJonnalagadda)

‘జాక్’ (Jack) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా తెలుపుతూ.. సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు స్పెషల్‌గా టైటిల్ లుక్ పోస్టర్‌తో పాటు.. మేకర్స్ విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ పోస్టర్‌లో రెండు గన్స్ పట్టుకుని.. ఒక డాన్‌లా సిద్దు జొన్నలగడ్డ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘జాక్’ టైటిల్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి త్వరలోనే అప్‌డేట్స్ ఉంటాయని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.


Siddhu.jpg

చాలా గ్యాప్ తర్వాత ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ వంటి సినిమాతో బొమ్మరిల్లు భాస్కర్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆయనకు మంచి గుర్తింపునే ఇచ్చింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన బొమ్మరిల్లు భాస్కర్‌తో.. యూత్ సెన్సేషన్ సిద్దు సినిమా చేస్తున్నాడనే ప్రకటన వచ్చినప్పుడే ఈ సినిమాపై భారీగా క్రేజ్ ఏర్పడింది. పూర్తిగా వినోదాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా.. కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. (Jack Movie)


ఇవి కూడా చదవండి:

====================

*Varun Tej: ఫస్ట్ లావణ్య.. తర్వాత ఆ హీరోయిన్ అంటే ఇష్టం

**************************

*Rashmika Mandanna: ఏం చేయను.. మీడియా అలా రాస్తోందని చెబుతా..

******************************

*Kavya Thapar: గోపీచంద్, శ్రీను వైట్ల కాంబో మూవీ టైటిల్ లీక్ చేసిన ‘ఈగల్’ భామ

************************

*Sai Pallavi: సాయి పల్లవి సినిమా రీ రిలీజ్.. లేడీ పవర్ స్టార్ అని అనేది అందుకే..

*****************************

*Super Star: ఇక ‘సూపర్‌స్టార్‌’ ట్యాగ్‌ చర్చకు తెరపడినట్టేనా? విజయ్ అభిమానులకు హితబోధ

*****************************

Updated Date - Feb 07 , 2024 | 01:28 PM