Rashmika Mandanna: ఏం చేయను.. మీడియా అలా రాస్తోందని చెబుతా..

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:05 PM

సోషల్ మీడియాలో హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్స్ గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తుంటాయి. ఈ వార్తలపై కొందరు సెలబ్రిటీలు రెస్పాండ్ అవుతుంటారు. మరికొందరు సరదాగా తీసుకుని.. అలాంటి వార్తలు చూసుకుని నవ్వుకుంటారు. తాజాగా తనపై వచ్చిన ఇలాంటి వార్తకు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సరదాగా సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఆమె పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Rashmika Mandanna: ఏం చేయను.. మీడియా అలా రాస్తోందని చెబుతా..
Rashmika Mandanna

సోషల్ మీడియాలో హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్స్ గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తుంటాయి. ఈ వార్తలపై కొందరు సెలబ్రిటీలు రెస్పాండ్ అవుతుంటారు. మరికొందరు సరదాగా తీసుకుని.. అలాంటి వార్తలు చూసుకుని నవ్వుకుంటారు. ఇంకొందరైతే.. ఆ వార్తలు పుట్టించిన వారిపై సీరియస్ అవుతుంటారు. ఈ విషయంలో ఎప్పుడూ వార్తలు వినబడుతూనే ఉంటాయి. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) రెమ్యూనరేషన్‌పై కూడా ట్విట్టర్ ఎక్స్‌లో ఒక వార్త వైరల్ అవుతోంది. దీనిపై రష్మిక సరదాగా కామెంట్ చేశారు.

‘‘యానిమల్ సక్సెస్ తర్వాత రష్మిక మందన్నా తన రెమ్యూనరేషన్‌ని పెంచేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆమె ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుండి రూ. 4.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోందట’’ అని ఉన్న ఓ ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చిన రష్మిక.. ‘‘నేను రెమ్యూనరేషన్ పెంచానని ఎవరు చెప్పారు. ఈ వార్తలు చూసి ఆశ్చర్యపోతున్నా. మీ వార్తలు చూసిన తర్వాత.. ఇకపై రెమ్యూనరేషన్ విషయంలో ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఒకవేళ నిర్మాతలు కనుక.. మీరు రెమ్యూనరేషన్ ఎందుకు పెంచారని అడిగితే మాత్రం.. ఏం చేయను సార్.. మీడియా అలానే చెబుతుంది.. నేను వారి మాటలకు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నట్లుగా చెబుతాను..’’ అని సరదాగా చెప్పుకొచ్చారు. ఇప్పుడామె ఇచ్చిన రిప్లయ్‌కి నెటిజన్లు కూడా ‘మాస్ బ్యాటింగ్’ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.


Rashmika-Mandanna.jpg

ఈ కామెంట్ చేసిన వారిలో ‘బేబీ’ నిర్మాత ఎస్‌కెఎన్ కూడా ఉన్నారు. ఈ వార్త రాకముందే మా సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్ ప్రారంభమైనందుకు హ్యాపీగా ఉందని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న సినిమాలలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కూడా ఒకటి. ఇది ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుని రెగ్యులర్ షూట్‌ కూడా జరుపుకుంటోంది. ఈ సినిమా కాకుండా.. తెలుగు, హిందీలలో రష్మిక ఓ నాలుగైదు సినిమాల వరకు చేస్తోంది. అందులో ‘పుష్ప ది రూల్’‌పై భారీగా అంచనాలున్నాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Kavya Thapar: గోపీచంద్, శ్రీను వైట్ల కాంబో మూవీ టైటిల్ లీక్ చేసిన ‘ఈగల్’ భామ

************************

*Sai Pallavi: సాయి పల్లవి సినిమా రీ రిలీజ్.. లేడీ పవర్ స్టార్ అని అనేది అందుకే..

*****************************

*Super Star: ఇక ‘సూపర్‌స్టార్‌’ ట్యాగ్‌ చర్చకు తెరపడినట్టేనా? విజయ్ అభిమానులకు హితబోధ

*****************************

Updated Date - Feb 06 , 2024 | 09:05 PM