Honeymoon Express: ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్’ టీజర్ ఆవిష్కరించిన అక్కినేని అమల

ABN , Publish Date - Jun 09 , 2024 | 03:43 PM

చైతన్య రావ్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ‌గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. జూన్ 21న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోన్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా అమల అక్కినేని విడుదల చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Honeymoon Express: ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్’ టీజర్ ఆవిష్కరించిన అక్కినేని అమల
Honeymoon Express Teaser Launch

చైతన్య రావ్ (Chaitanya Rao), హెబ్బా పటేల్ (Hebah Patel) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’ (Honeymoon Express). ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా (New Reel India Entertainments Pvt. Ltd.) బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ‌గా దర్శకుడు బాల రాజశేఖరుని (Bala Rajasekharuni) రూపొందించారు. జూన్ 21న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోన్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా అమల అక్కినేని (Amala Akkineni) విడుదల చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read- Gangs Of Godavari OTT: డేట్ ఫిక్సయింది.. లంకల రత్నం జాతర ఇక ఓటీటీలో!

టీజర్ రిలీజ్ అనంతరం అమల అక్కినేని మాట్లాడుతూ.. “యాక్టింగ్, స్క్రీన్‌ప్లే రైటింగ్‌లో ప్రొఫెసర్‌గా బాల అమెరికాలో చాలా కాలం పనిచేశారు. అమెరికాలో ఉన్న, ఆయనకు ఏదో ఒకరోజు తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలని ఉండేది. ఆయన కల ఈ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ సినిమాతో నెరవేరినందుకు సంతోషంగా ఉంది. టీచింగ్ ఒక బాధ్యత అయితే ఫిల్మ్ మేకింగ్ మరో సవాలు లాంటిది. మా అన్నపూర్ణ కాలేజ్ ఫ్యాకల్టీలు, స్టాఫ్, స్టూడెంట్స్‌ను బాల ఈ సినిమాకు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా టీజర్ ఫన్నీగా, రొమాంటిక్‌గా ఉంది. సమాజంలో నేడు రొమాంటిక్, వివాహ బంధాలు ఎలా ఉన్నాయనే ఒక బలమైన కథను చూపించబోతున్నట్లుగా ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈరోజు పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండే సబ్జెక్ట్ ఇది. జూన్ 21న, ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి, విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. బాల, ఆయన టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. (Amala Akkineni Launches Honeymoon Express Teaser)


amala-Honeymoon-Express.jpg

దర్శకుడు బాల రాజశేఖరుని (Director Bala Rajasekharuni) మాట్లాడుతూ.. నా మనసులో అన్నపూర్ణ స్టూడియోస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. చాలాకాలం నుంచి అమెరికాలో ఉన్న నన్ను.. అమల‌గారు, నాగార్జున‌ (King Nagarjuna)గారు ఇండియాకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు డీన్‌గా బాధ్యతలు అప్పగించారు. వాళ్ల ప్రోత్సాహంతో దర్శకుడిగా నా ఫస్ట్ తెలుగు మూవీ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ ప్రారంభించాను. ఇందులో అన్నపూర్ణ కాలేజ్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ ఇతర స్టాఫ్ అన్ని డిపార్ట్‌మెంట్లలో కీలకమైన పాత్రలు వహించారు. నా మెంటార్‌గా భావించే నాగార్జునగారు మా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం విశేషం. అలాగే, అమలగారు టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం. అక్కినేని కుటుంబం (Akkineni Family) నుంచి లభిస్తున్న ఈ సపోర్ట్‌కు మా మూవీ టీమ్ తరుపున నా కృతజ్ఞతలు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందనను రాబట్టుకుంటున్నాయి. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా జూన్ 21న రాబోతోన్న మా సినిమాను సుచిన్ సినిమాస్ (Suchin Cinemas) డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు విడుదల చేస్తున్నారని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Jun 09 , 2024 | 03:43 PM