మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Aarambham: హీరో శ్రీ విష్ణుతో మ్యూజిక్ ప్రమోషన్స్ ‘ఆరంభం’

ABN , Publish Date - Mar 02 , 2024 | 05:07 PM

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆరంభం’. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘అనగ అనగ’ను మేకర్స్ విడుదల చేశారు.

Aarambham: హీరో శ్రీ విష్ణుతో మ్యూజిక్ ప్రమోషన్స్ ‘ఆరంభం’
Aarambham Movie First Single Launch Event

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆరంభం’ (Aarambham). ఈ సినిమాను ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను మేకర్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘అనగా అనగా..’ (Anaga Anaga)ను యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

పాట విడుదల అనంతరం హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘ఆరంభం’ సినిమా టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను ఇప్పుడే చూశాను. టీజర్, సాంగ్ చాలా బాగుంది. చాలా ఫ్రెష్‌గా అనిపించాయి. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ (Aarambham Movie First Lyrical Song)ను నేను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. చూడగానే నేను ఇంప్రెస్ అయినట్లే థియేటర్‌కి వచ్చే ఆడియెన్స్‌కు కూడా ‘ఆరంభం’ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్.. మిగతా వాళ్లు అంతా యంగ్ టీమ్ ఈ సినిమాకు పనిచేశారు. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని అన్నారు.


SP-Charan.jpg

‘అనగ అనగ’ పాట విషయానికి వస్తే.. స్వరూప్ గోలి లిరిక్స్ అందించగా.. ఎస్ పి చరణ్ (SP Charan) ఆలపించారు. సింజిత్ ఎర్రమిల్లి క్యాచీ ట్యూన్‌తో పాటను కంపోజ్ చేశారు.

‘వాలే పొద్దుల్లో పాడిందే పాట, చుట్టేస్తుంటారే ఈ ఊరంతా..

హద్దే లేకుండా ఆడిందే ఆట, లేదే బేజారంట..

సాగే మేఘాలే దారే మారాయే, చూసొద్దామా ఈ సరదాలంటూ,

వీచే గాలుల్నే అటుగా తిప్పాయే, రారా ఓ సారంటూ..

మది పాడే ఈ సంగీతం దరి రాదే ఏ సంకోచం,

మరి మీదే ఈ సల్లాపం, అంటూ సాగిందే మీ పయనం..

అనగా అనగా అనగా పదాలే.. కలిపావంటే ఒకటై పోవా..’ అంటూ ఒక ఊరి నేపథ్యంగా, ఆహ్లాకరంగా సాగుతుందీ పాట. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Anaga Anaga Lyrical Song From Aarambham Out)


ఇవి కూడా చదవండి:

====================

*Save The Tigers 2: ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

***************************

*Charan and Upasana: భార్య కాళ్లకు మసాజ్ చేస్తున్న రామ్ చరణ్.. వీడియో వైరల్

************************

*Tarak and Charan: రామ్-భీమ్ కలిసి ఒకే కారులో.. వీడియో వైరల్

********************

*Jr NTR: ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, రిషభ్ శెట్టి, ప్రశాంత్ నీల్.. ఏంటి కథ?

**************************

Updated Date - Mar 02 , 2024 | 05:07 PM