Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ టీజర్‌కు టైమ్ ఫిక్సయింది

ABN , Publish Date - May 01 , 2024 | 10:25 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ. దయాకర్‌రావు నిర్మిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించి తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ వదిలారు. టీజర్‌ని మే 2వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ టీజర్‌కు టైమ్ ఫిక్సయింది
HariHara Veeramallu Poster

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ (Director Krish) కాంబినేషన్‌లో ఏఎం రత్నం (AM Rathnam) సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ (Mega Surya Production) పతాకంపై ఏ. దయాకర్‌రావు నిర్మిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మేకర్స్ ఓ అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో టీజర్ విడుదల అని తెలిపిన మేకర్స్.. తాజాగా టీజర్ ఎప్పుడు విడుదల కాబోతుందో తెలియజేశారు.

*Alluri Seetarama Raju: వెండితెరపై కృష్ణ చేసిన సాహసానికి నిదర్శనం 


జై శ్రీరామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో…

మీ ముందుకు... ‘ధర్మం కోసం యుద్ధం’ త్వరలో! అని తెలుపుతూ.. టీజర్ అతి త్వరలో విడుదల చేయనున్నామని మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ అధికారికంగా ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. టీజర్‌ని గురువారం (మే 2వ తేదీ) ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలుపుతూ.. ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వీరమల్లు’ గెటప్‌ షెడ్ కనిపిస్తోంది. చేతిలో పవర్ ఫుల్ కత్తితో యుద్ధానికి సిద్ధమైన సైనికుడిలా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. (Harihara Veeramallu Teaser Release Update)


Veeramallu.jpg

వాస్తవానికి ఈ సినిమా ఆగిపోయినట్లుగా ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పొలిటికల్‌గా బిజీ కావడంతో.. ఇక ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడమే కష్టమే అనేలా వచ్చిన వార్తలకు నిర్మాత ఏఎం రత్నం.. ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు టీజర్ వదిలి.. అలాంటి వార్తలకు పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. ఎలక్షన్స్ అనంతరం పవన్ కళ్యాణ్ ఈ సినిమా బ్యాలెన్స్ షూట్‌లో పాల్గొనున్నారని తెలుస్తోంది.

Read Latest Cinema News

Updated Date - May 01 , 2024 | 10:25 AM