HariHaraVeeraMallu: అది నిజం కాదు

ABN , First Publish Date - 2023-05-29T17:28:12+05:30 IST

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా సెట్స్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇంతకీ అక్కడ అగ్ని ప్రమాదం సంభవించిందా, లేదా అవన్నీ వుట్టి వార్తలేనా అని దర్శకుడు క్రిష్ ని అడిగితే, అతను ఈ వార్తల గురించి మాట్లాడేడు.

HariHaraVeeraMallu: అది నిజం కాదు

హరిహర వీరమల్లు #HariHaraVeeraMallu సెట్ లో అగ్ని ప్రమాదం #FireAccidentAtPawanKalyanFilmSet అంటూ ఉదయం నుండీ వార్తలు వైరాలు అవుతూనే వున్నాయి. అందులో కథానాయకుడిగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ కి (PawanKalyan) తప్పిన పెను ప్రమాదం అని కూడా ఆ వార్తల్లో వుంది. ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ కాగా (Director Krish), ఏఎమ్ రత్నం (AMRathnam) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా కోసం వేసిన సెట్ అంతా కాలిపోయింది అని, హైదరాబాద్ దుండిగల్ (Dundigal) పరిధిలోని బౌరంపేటలో ఈ ఘటన చోటుచేసుకుందని కూడా వైరల్ అయింది. అలాగే ఈ ఘటన అర్థరాత్రి సమయంలో జరిగినందున ఎక్కువ తెలియలేదని కూడా వార్తలో అన్నారు. గతంలో అదే ప్రాంతంలో వేసిన సెట్ వర్షానికి కూలిపోయిందని, ఇప్పుడు దానికి మరమ్మత్తు చేస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని కూడా అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేశారు అని కూడా వార్తలు వచ్చాయి.

Janasena-Pawan.jpg

అయితే ఈ వార్తలన్నీ నిజం కాదని, అగ్ని ప్రమాదం అసలు తమ సెట్ లోనే జరగలేదని ఆ సినిమా దర్శకుడు క్రిష్ అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిందట కదా మీ సెట్ లో అని అడిగితే, "మా సెట్ లో ఎటువంటి అగ్ని ప్రమాదం జరగలేదు, అది చాలా రాంగ్ వార్త", అని చెప్పారు క్రిష్ అడిగినప్పుడు.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆమధ్య 'ఓజి' #OG సినిమా షూటింగ్ చేశారు, తరువాత 'ఉస్తాద్ గబ్బర్ సింగ్' #UstaadGabbarSingh సినిమా షూటింగ్ కూడా కొన్ని రోజులు చేసాడు, అలాగే 'బ్రో' #Bro సినిమా కూడా పూర్తయిపోవచ్చింది కూడా. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' #HariHaraVeeraMallu సినిమా షూటింగ్ చేస్తున్నట్టుగా సమాచారం.

Updated Date - 2023-05-29T17:28:12+05:30 IST