Viswam: గోపీచంద్ లైట్ గడ్డంతో, డార్క్ కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా.. ఫస్ట్ స్ట్రైక్!

ABN , Publish Date - Apr 11 , 2024 | 08:00 PM

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్ర ఫస్ట్ స్ట్రైక్ వీడియోను ఈద్ సందర్భంగా విడుదల చేయడం ద్వారా మాస్ ఫీస్ట్‌ని అందించారు. గోపీచంద్ 32వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్‌ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తుండగా.. రీసెంట్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ భాగస్వామిగా చేరారు. ఈ చిత్రానికి ‘విశ్వం’ అనే టైటిల్ ఖరారు చేశారు.

Viswam: గోపీచంద్ లైట్ గడ్డంతో, డార్క్ కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా.. ఫస్ట్ స్ట్రైక్!
Macho Star Gopichand in Viswam

మాచో స్టార్ గోపీచంద్ (Macho Star Gopichand), దర్శకుడు శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్ర ఫస్ట్ స్ట్రైక్ వీడియోను ఈద్ సందర్భంగా విడుదల చేయడం ద్వారా మాస్ ఫీస్ట్‌ని అందించారు. గోపీచంద్ 32వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్‌ (Chitralayam Studios) బ్యానర్‌పై వేణు దోనేపూడి (Venu Donepudi) నిర్మిస్తుండగా.. రీసెంట్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) సంస్థ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మాణ భాగస్వామిగా చేరారు. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ‘విశ్వం’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ.. ఫస్ట్ స్ట్రైక్‌ని మేకర్స్ వదిలారు.

*Sriranga Neethulu: టైటిలే ఓల్డ్.. సినిమా మాత్రం గోల్డ్.. డోంట్ మిస్


ఈ ఫస్ట్ స్ట్రైక్‌లో.. వధూవరులు పెళ్లి మండపంలోకి రావడం, సంగీత విద్వాంసుల బృందం వివిధ వాయిద్యాలను వాయిస్తూ, పూజారి మంత్రాలు పఠించడం, రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్న చెఫ్‌లు.. ఇలా వివాహ వేడుకలతో ఈ వీడియో ప్రారంభమైంది. గోపీచంద్ పెద్ద గిటార్ కేస్‌ని భుజంపై వేసుకుని పెళ్లి వేదిక వైపు నడుస్తూ ఎంట్రీ ఇచ్చారు. అది గిటార్ కాదు, మెషిన్ గన్. ఆశ్చర్యకరంగా, అతను వధూవరులను, వివాహానికి వచ్చిన అతిథులందరినీ షూట్ చేసి.. చివరగా, అతను అక్కడ ఫుడ్‌ని ఆస్వాదిస్తూ.. ‘దానే దానే పే లిఖా, ఖానే వాలే కా నామ్... ఇస్పే లిఖా మేరే నామ్..’ అనే డైలాగ్‌తో ఈ స్ట్రైక్ ముగించారు. (Viswam First Strike)


Gopichand-Movie.jpg

లైట్ గడ్డంతో, డార్క్ కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించిన గోపీచంద్‌ (Gopichand)ని నెగెటివ్‌ షేడ్‌లో చూడటం సర్‌ప్రైజింగ్‌గా ఉంది. అతను డైలాగ్ పలికిన విధానం క్యారెక్టర్ గ్రే షేడ్‌ని సూచిస్తుంది. శ్రీను వైట్ల ఫస్ట్ స్ట్రైక్‌ని మాస్ ఫీస్ట్‌గా ప్రజెంట్ చేశారు. గోపీచంద్‌ని ఒక విభిన్నమైన పాత్రలో చూపించినట్లుగా తెలుస్తోంది. కేవీ గుహన్‌ కెమెరా, చైతన్ భరద్వాజ్ స్కోర్ సినిమా సాంకేతికంగా ఈ సినిమా ఎంత రిచ్‌గా ఉండబోతుందో తెలియజేస్తుంది. కాగా.. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ (Gopi Mohan) ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాశారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

**********************

*Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..

****************************

*Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!

*********************

Updated Date - Apr 11 , 2024 | 08:00 PM