Nenu Keerthana: టీజర్‌ సక్సెస్‌తో యూనిట్ హ్యాపీ.. త్వరలోనే విడుదల

ABN , Publish Date - Apr 14 , 2024 | 08:12 AM

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్), రిషిత, మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం ‘నేను-కీర్తన’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ మంచి స్పందనను రాబట్టుకోవడంతో చిత్రబృందం తమ ఆనందాన్ని తెలియజేసింది.

Nenu Keerthana: టీజర్‌ సక్సెస్‌తో యూనిట్ హ్యాపీ.. త్వరలోనే విడుదల
Nenu Keerthana Movie Still

చిమటా ప్రొడక్షన్స్ (Chimata productions) పతాకంపై చిమటా రమేష్ బాబు (Chimata Ramesh Babu) (సి.హెచ్.ఆర్)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్), రిషిత, మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం ‘నేను-కీర్తన’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ మంచి స్పందనను రాబట్టుకోవడంతో చిత్రబృందం తమ ఆనందాన్ని తెలియజేసింది. (Nenu Keerthana Movie)

*Raj Tarun: రాజ్ తరుణ్, రాశి సింగ్‌ల సినిమాకు క్లాప్ పడింది..


మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉందని, చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడిందని దర్శకహీరో చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) తెలిపారు. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు, ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని, త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని తెలుపుతూ.. టీజర్‌ని ఆదరించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా.. సంధ్య, జీవా, విజయరంగరాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎల్.రాజా.


ఇవి కూడా చదవండి:

====================

*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

**********************

*Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..

****************************

Updated Date - Apr 14 , 2024 | 05:29 PM