Game On: జీవితంపై విరక్తి చెందిన ఎంప్లాయ్ ఒక గేమ్‌లో పడితే..

ABN , Publish Date - Jan 20 , 2024 | 06:39 PM

గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే ఒక ఎంప్లాయ్.. జీవితంపై విరక్తి చెంది ఒక గేమ్‌లో పడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించామని అన్నారు హీరో గీతానంద్. ఆయన హీరోగా, నేహా సోలంకి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘గేమ్ ఆన్‌’. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Game On: జీవితంపై విరక్తి చెందిన ఎంప్లాయ్ ఒక గేమ్‌లో పడితే..
Game On Movie Trailer Launch Event

గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే ఒక ఎంప్లాయ్.. జీవితంపై విరక్తి చెంది ఒక గేమ్‌లో పడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించామని అన్నారు హీరో గీతానంద్. ఆయన హీరోగా, నేహా సోలంకి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘గేమ్ ఆన్‌’. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో గీతానంద్ మాట్లాడుతూ.. ట్రైలర్‌లో చూసింది 10 శాతం మాత్రమే. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. మంచి కాన్సెప్ట్ రాసుకుని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. ఇదొక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే ఒక ఎంప్లాయ్ జీవితంపై విరక్తి చెంది ఒక గేమ్‌లో పడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. మధుబాల, ఆదిత్య మీనన్ వంటి సీనియర్ నటులు ఇందులో యాక్ట్ చేయడంతో.. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లింది. గేమ్ స్టార్ట్ చేశాం.. మా గేమ్‌ను ప్రేక్షకులే గెలిపించాలి. ఈ సినిమా తర్వాత మా తమ్ముడైన డైరెక్టర్ దయానంద్ యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుంటాడు. నేను కూడా నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని చెప్పారు.


Game-On-Movie.jpg

‘‘కమర్షియల్ స్క్రిప్ట్‌ని రా అండ్ రస్టిక్‌గా చిత్రీకరించాం. పూరి జగన్నాథ్ ఫ్యాన్‌గా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి, రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్‌ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ సినిమా తెరకెక్కింది’’ అని చెప్పారు దర్శకుడు దయానంద్‌. నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ... ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. గీతానంద్ నా క్లాస్మేట్. ఏదో ఒక రోజు సినిమా తీద్దామని అనుకున్నాం. మంచి కథతో ఈ సినిమాను స్టార్ట్ చేసాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించాం. ఇలాంటి కథ ఇప్పటివరకు తెలుగు తెరపై రాలేదని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Mohan Babu: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?

****************************

*Varun Tej: మెగా ప్రిన్స్ బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉందంటే?

**************************

*Hansika: 34 నిమిషాల షాట్‌ని సింగిల్ టేక్‌లో..

***************************

Updated Date - Jan 20 , 2024 | 06:40 PM