40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RAM: ‘రామ్’ చిత్రంపై శైలేష్ కొలను ప్రశంసలు

ABN, Publish Date - Jan 21 , 2024 | 03:40 PM

ఒక మంచి సామాజిక సందేశంతో వస్తున్న ‘రామ్’ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా రూపుదిద్దుకున్న చిత్రం ‘రామ్’ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్). జనవరి 26న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని తాజాగా కొందరు సినీ ప్రముఖుల కోసం మేకర్స్ ప్రత్యేక ప్రీమియర్‌ని నిర్వహించారు.

Surya Ayyalasomyajula and Sailesh Kolanu

ఒక మంచి సామాజిక సందేశంతో వస్తున్న ‘రామ్’ (Ram) సినిమా ఘన విజయం సాధించాలని కోరారు ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu). దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా రూపుదిద్దుకున్న చిత్రం ‘రామ్’ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్). మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రంలో సూర్య అయ్యలసోమయజుల (Surya Ayyalasomyajula), ధన్యా బాలకృష్ణ (Dhanya Balakrishna) హీరోహీరోయిన్లుగా నటించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సినిమా విడుదలకు ముందే కొందరు సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా ఓ షో ని ప్రదర్శించారు.

పేట్రియాటిక్ జానర్‌‌లో కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కిన ఈ సినిమాని చూసిన వారంతా ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ ప్రీమియర్‌ షో చూసిన దర్శకుడు శైలేష్ కొలను యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సినిమా చాలా బాగుందని, ఇందులో ఒక మంచి సామాజిక సందేశాన్ని ఇచ్చారని పొగిడారు. ధారన్ సుక్రి విజువల్స్, ఆశ్రిత్ సంగీతం మేజర్ అస్సెట్ అవుతుందని తెలుపుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. (RAM Ready to Release)


రిపబ్లిక్ డే‌కి సినిమా వస్తుందంటే అందులో ఎంతో కొంత దేశ భక్తికి సంబంధించిన అంశాలు ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ ‘రామ్’ చిత్రం పూర్తిగా దేశభక్తి అంశాలతో తెరకెక్కింది. ఈ రిపబ్లిక్ ‌డేకి ఇది పర్ఫెక్ట్ చిత్రమని మేకర్స్ తెలిపారు. సినిమాని చూసి.. యూనిట్‌ను అభినందించిన దర్శకుడు శైలేష్ కొలనుకు చిత్రయూనిట్ తరపున దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Rashmika Mandanna: తనపై డీప్‌ ఫేక్‌ వీడియో చేసిన వ్యక్తి అరెస్ట్‌పై రష్మిక రియాక్షన్ ఇదే..

****************************

*HanuMan: అయోధ్య రామమందిరానికి ‘హనుమాన్’ సినిమా విరాళం ఎంతంటే?

****************************

*Esha Gupta: ఇక్కడ వైట్‌ స్కిన్‌ ఉండే నటులదే హవా..

***********************

*Sitara Ghattamaneni: ‘ఓ మై బేబీ’ పాటకు ఎంత చక్కగా డ్యాన్స్ చేసిందో చూశారా..

*****************************

Updated Date - Jan 21 , 2024 | 03:41 PM