Esha Gupta: ఇక్కడ వైట్‌ స్కిన్‌ ఉండే నటులదే హవా..

ABN , Publish Date - Jan 21 , 2024 | 11:36 AM

మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌.. మోడల్‌.. కథానాయిక.. ‘ఇషా గుప్తా’. తెరమీదనే కాదు సోషల్‌ మీడియాలోనూ హాట్‌గా అలరిస్తుంటుందీమె. ఇన్‌స్టాలో కెరీర్‌ కంటే వ్యక్తిగత విశేషాలు, ప్రయాణాలు, ఈవెంట్స్‌, యోగా ఫొటోలు, ఫొటోషూట్స్‌ను ఎక్కువగా షేర్‌ చేస్తుంటోంది. ‘ఫొటో షేర్‌ చేశానంటే ఏదీ పట్టించుకోను. ఎలాంటి కామెంట్స్‌ చదవను. అలా అటెన్షన్‌గా ఉంటే మాత్రం ఇబ్బందులే’ అంటుందీ భామ.

Esha Gupta: ఇక్కడ వైట్‌ స్కిన్‌ ఉండే నటులదే హవా..
Esha Gupta

మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌.. మోడల్‌.. కథానాయిక.. ‘ఇషా గుప్తా’. తెరమీదనే కాదు సోషల్‌ మీడియాలోనూ హాట్‌గా అలరిస్తుంటుందీమె. ఇన్‌స్టాలో కెరీర్‌ కంటే వ్యక్తిగత విశేషాలు, ప్రయాణాలు, ఈవెంట్స్‌, యోగా ఫొటోలు, ఫొటోషూట్స్‌ను ఎక్కువగా షేర్‌ చేస్తుంటోంది. ‘ఫొటో షేర్‌ చేశానంటే ఏదీ పట్టించుకోను. ఎలాంటి కామెంట్స్‌ చదవను. అలా అటెన్షన్‌గా ఉంటే మాత్రం ఇబ్బందులే’ అంటుందీ భామ. ఈ ఢిల్లీ భామ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..

‘ఇప్పటికీ తెల్లతోలుకే ప్రాధాన్యం ఇక్కడ. నల్లగా ఉంటే పెద్దగా పట్టించుకోరు. నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినపుడు కొందరు అదే పనిగా వచ్చి.. నీకు మేకప్‌ నప్పదు అనేవాళ్లు. మేకప్‌ ఆర్టిస్ట్‌కు దర్శకుడి సలహా ఉంటుంది. ఫలానా క్యారెక్టర్‌కు తగినట్లే వేస్తారు. ఆ విషయం తెలుసు. అయినా అడుగుతారు. అయితే ఇక్కడ తెల్లగా ఉండే అమ్మాయిలకు అలాంటి సమస్య ఉండదు. ఎవరూ అలా అడగరు. తెల్లగా ఉండే బ్యూటిఫుల్‌ అంటారు. ఇక్కడ వైట్‌ స్కిన్‌ ఉండే నటులదే హవా ఉంటుంది’ అంటుంది ఇషా.

Esha-Gupta.jpg

అలా సినీ పరిశ్రమలోకి..

న్యూఢిల్లీలో పుట్టిపెరిగింది ఇషా గుప్తా. తండ్రి ఎయిర్‌ఫోర్స్‌, అమ్మ గృహిణి. తనకో తోబుట్టువు ఉంది. డెహ్రడూన్‌లో చదివింది. మణిపాల్‌ విశ్వవిద్యాలయం నుంచి మాస్‌ కమ్యూనికేషన్‌ చేసింది. 2007లో ఫెమినా మిస్‌ ఇండియాగా బెస్ట్‌ ఫొటోజెనిక్‌ ఫేస్‌గా ఎంపికైంది. మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌లో మెరిసింది. ఈ దెబ్బతో ఆమెకు కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌ మీద ఫోజిచ్చే అవకాశం కలిగింది. అప్పట్లో అదో సంచలనం. అలా 2012లో టెలివిజన్‌లో సిఐడీ అనే సిరీస్‌లో నటించింది. ‘జన్నత్‌ 2’, ‘రాజ్‌ 3డీ’ చిత్రాల్లో ఇమ్రాన్‌హస్మీతో కలసి హాట్‌గా నటించటంతో యూత్‌లో ఫాలోయింగ్‌ వచ్చింది. ‘చక్రవ్యూహ్‌’, ‘రుస్తుం’ లాంటి విభిన్న చిత్రాల్లో నటించిన ఆమె తెలుగులో ‘వినయ విధేయరామ’ చిత్రంలో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఆ తర్వాత ఇషా గుప్తా పని అయిపోందన్నారు. అయితే మళ్లీ ఆమె కెరీర్‌ గాడిలో పడింది. 2020 నుంచి ‘రిజెక్ట్‌ ఎక్స్‌’, ‘నకాబ్‌’, ‘ఆశ్రమ్‌’ వెబ్‌సిరీస్‌‌లలో పాపులరైంది. ప్రస్తుతం ‘మర్డర్‌ 4’ చిత్రంతో పాటు మరో మూడు చిత్రాల్లో నటిస్తోంది ఇషా గుప్తా. (Esha Gupta Cine Entry)


Eesha.jpg

అదే నా బలం..

‘యోగా అంటే ప్రాణం. ప్రతిరోజూ యోగా చేయాల్సిందే. శరీరాన్ని మాత్రమే కాదు మనసునూ శుభ్రం చేస్తుంది యోగా. మెడిటేషన్‌తో పాటు ప్రాణాయామ చేస్తా. ఫిట్‌గా ఉండటమే కాదు.. యోగాతో ఇతరులనూ ఇన్‌స్పైర్ చేయవచ్చు’ అంటుంది ఇషాగుప్తా. 2019లో మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ అయిన ఇషాకు ఎండోర్స్‌మెంట్స్‌ కొదువే లేదు. స్టయిలిష్‌గా, ఫ్యాషన్‌లో అప్‌డేట్‌గా ఉండటం ఇష్టమంటుంది ఇషా. ఎక్కువగా విదేశాల్లో విహరించే ఇషాకు ఎప్పటికీ తన అమ్మే మంచి స్నేహితురాలంటుంది. ‘ఎప్పుడూ స్టార్‌ను అవుతానని అనుకోలేదు. అయ్యాను. వందశాతం ఎఫర్ట్‌ ఉంచి మరింత పేరు తెచ్చుకోవాలి’ అంటుంది ఇషా గుప్తా. (Esha Gupta Bollywood Actress)


ఇవి కూడా చదవండి:

====================

*Sitara Ghattamaneni: ‘ఓ మై బేబీ’ పాటకు ఎంత చక్కగా డ్యాన్స్ చేసిందో చూశారా..

*****************************

*Saripodhaa Sanivaaram: దిల్ రాజు చేతుల్లోకి.. డివివి వాళ్ల సినిమా

*************************

*Rashmika Mandanna: రష్మిక డీప్‌ ఫేక్ వీడియో.. ఏపీ వ్యక్తి అరెస్ట్

****************************

*Mohan Babu: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?

****************************

Updated Date - Jan 21 , 2024 | 11:36 AM