HanuMan: అయోధ్య రామమందిరానికి ‘హనుమాన్’ సినిమా విరాళం ఎంతంటే?

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:42 PM

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హను మాన్’. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 150 కోట్ల మార్కును క్రాస్ చేసి.. వీక్ డేస్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది. మేకర్స్ చెప్పినట్లుగానే ఈ సినిమాకు అమ్ముడైన ఒక్కో టికెట్ నుండి రూ. 5లను మొత్తంగా రూ. 2.66 కోట్లను రామమందిరానికి విరాళంగా ఇచ్చారు.

HanuMan: అయోధ్య రామమందిరానికి ‘హనుమాన్’ సినిమా విరాళం ఎంతంటే?
HanuMan for Ayodhya Ram Mandir

ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హను మాన్’ (HanuMan). సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా స్ట్రాంగ్ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల మార్కును క్రాస్ చేసి.. వీక్ డేస్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది. ‘హను-మాన్’ రెండవ వారాంతంలోనూ దేశీయ, విదేశాలలో మ్యాగ్జిమమ్ ఆక్యుపెన్సీని రీచ్ అవుతోంది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌తో పాటు, ప్రజల ఆదరాభిమానాలను అందుకుంది.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రోజు మేకర్స్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ద్వారా ఓ స్టేట్‌మెంట్ ఇప్పించారు. అయోధ్యలోని రామ మందిరానికి ఈ సినిమాకు తెగే ప్రతి టిక్కెట్ నుండి రూ. 5 విరాళంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆ విధంగా అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో ఈ సినిమా కూడా భాగమైంది. మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నట్లుగా, అయోధ్య రామమందిరానికి (#AyodhaRamMandir) ఒక్కో టికెట్ నుండి ₹5 పక్కన పెట్టి విరాళంగా ఇస్తున్నారు. (Hanu Man For Shreeram)


HanuMan.jpg

ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలకు విక్రయించిన 2,97,162 టిక్కెట్లకుగానూ రూ. 14,85,810 చెక్కును అయోధ్య రామమందిరానికి అందించారు. ఇప్పుడు మొత్తంగా లెక్కేస్తూ.. ఇప్పటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055ను అయోధ్య రామమందిరం కోసం అందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. (Ayodhya Ram Mandir)


ఇవి కూడా చదవండి:

====================

*Esha Gupta: ఇక్కడ వైట్‌ స్కిన్‌ ఉండే నటులదే హవా..

***********************

*Sitara Ghattamaneni: ‘ఓ మై బేబీ’ పాటకు ఎంత చక్కగా డ్యాన్స్ చేసిందో చూశారా..

*****************************

*Saripodhaa Sanivaaram: దిల్ రాజు చేతుల్లోకి.. డివివి వాళ్ల సినిమా

*************************

*Rashmika Mandanna: రష్మిక డీప్‌ ఫేక్ వీడియో.. ఏపీ వ్యక్తి అరెస్ట్

****************************

Updated Date - Jan 21 , 2024 | 12:42 PM