Mission C 1000: నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించిన ‘మిషన్ సి 1000’ మెలోడీ సాంగ్

ABN , Publish Date - May 30 , 2024 | 05:56 PM

ఎస్‌వి క్రియేషన్ పతాకంపై తేజేశ్వర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ సి 1000’. పాన్ ఇండియా రేంజ్‌లో 8 భాషలలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలోని మెలోడీ సాంగ్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా సక్సెస్‌ఫుల్ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఆవిష్కరించారు. తేజేశ్వర్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీమతి కిరణ్మయి, విరాట్ శౌర్య నిర్మాతలు.

Mission C 1000: నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించిన ‘మిషన్ సి 1000’ మెలోడీ సాంగ్
Mission C 1000 Movie First Look and Melody Song Launch Event

ఎస్‌వి క్రియేషన్ (SV Creation) పతాకంపై తేజేశ్వర్ (Tejeswar) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ సి 1000’ (Mission C 1000). పాన్ ఇండియా రేంజ్‌లో 8 భాషలలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలోని మెలోడీ సాంగ్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా సక్సెస్‌ఫుల్ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు (Dil Raju) ఆవిష్కరించారు. తేజేశ్వర్, ప్రగ్యా నయన్ (Pragya Nayan) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీధర్ ఆత్రేయ సంగీతం సమకూర్చగా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విన్ని అందిస్తున్నారు. శ్రీమతి కిరణ్మయి, విరాట్ శౌర్య నిర్మాతలు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. అన్ని పనులు పూర్తిచేసి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని దర్శకుడు తేజేశ్వర్ తెలిపారు. (Mission C 1000 Movie Latest Update)

*Sri Ranga Neethulu OTT: రెండు ఓటీటీలలో ‘శ్రీరంగనీతులు’.. బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్


Tejeswar.jpg

ఫస్ట్ లుక్, సాంగ్ విడుదల అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మిషన్ సి 1000’ టైటిల్, ఫస్ట్ లుక్, సాంగ్ చాలా బాగున్నాయని, సినిమా ఘన విజయం సాధించి టీమ్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని తెలిపారు (Mission C 1000 First Look and Song Launch). దిల్ రాజుకు చిత్రయూనిట్ ధన్యవాదాలు తెలిపారు. కబీర్ దుహన్ సింగ్, జయ ప్రకాష్, సుధ, అనిష్ కురువిల్లా, కాలి చరణ్ మహారాజ్, సంజయ్ పాండే తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి మసాదే లక్ష్మి నారాయణ (జర్నలిస్ట్), జేవిపి, విశ్వనాథ్ శ్రీనివాస్, ప్రసాద్ సానా పాటలు రాశారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి డాక్టర్ ఈలసాగరం ప్రభాకర్, వి.రేవంత్, గండికోట శ్రీనివాస్, టి. మహీంద్రా, టి శివ, ఎమ్ జగదీశ్వర్, ఆర్ సుశీల్, జె మధు ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.

Read Latest Cinema News

Updated Date - May 30 , 2024 | 05:56 PM