VD 12: విజయ్ దేవరకొండ సినిమాలో సత్యదేవ్, తప్పుకున్న శ్రీలీల

ABN , Publish Date - May 30 , 2024 | 03:30 PM

విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ సినిమా నుండి మొదట అనుకున్నట్టుగా శ్రీలీల కథానాయకురాలుగా చెయ్యడం లేదు, ఆమె ప్లేస్ లో వేరే ఆమెని తీసుకున్నారు. అలాగే ఈ సినిమాలో సత్యదేవ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది.

VD 12: విజయ్ దేవరకొండ సినిమాలో సత్యదేవ్, తప్పుకున్న శ్రీలీల
Vijay Deverakonda, Satya Dev, Sreeleela

విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'జెర్సీ' ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు అని సమాచారం. అలాగే ఈ సినిమా అధికారికంగా లాంచ్ చేసినప్పుడు ఈ సినిమాలో శ్రీలీల కథానాయకురాలిగా ప్రకటించారు, ఆమె ఆ ముహూర్తం ఈవెంట్ కి హాజరైంది కూడా. (Satyadev to play a key role in Vijay Deverakonda and Gautam Tinnanuri film)

bhagyashreeborse.jpg

సితార ఎంటర్ టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పుడు శ్రీలీల తప్పుకున్నట్టుగా సమాచారం. ఆమెకి బదులుగా భాగ్యశ్రీ బోర్సే ని కథానాయకురాలిగా తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఇంకొక కథానాయకురాలు కూడా ఉందని, ఆమెని కూడా త్వరలోనే ఎంఐపిక చేస్తారని తెలుస్తోంది. (Sreeleela supposed to play the lead actress, but she comes out of this project and now Bhagyashree Borse steps in)

satyadev.jpg

భాగ్యశ్రీ బోర్సే హిందీ సినిమా 'యారియాన్ 2' తో చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. తెలుగులో దర్శకుడు హరీష్ శంకర్, రవి తేజతో చేస్తున్న 'మిష్టర్ బచ్చన్' సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా చిత్రీకరణ అయిపోయినట్టుగా సమాచారం, ఇప్పుడు విడుదలకి సిద్ధంగా వుంది. (VD12 Shooting is going on in Visakhapatnam) ఈ సినిమా విడుదలవకుండానే ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో ఆమెకి ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కథ సముద్రం నేపధ్యంలో ఉంటుంది అని, అందుకనే ఎక్కువ భాగం విశాఖపట్నంలో, ఇంకా శ్రీలంకలో చిత్రీకరణ జరుపుతారని తెలుస్తోంది.

Updated Date - May 30 , 2024 | 03:30 PM