అనుకున్నంత అయింది.. ప్ర‌శాంత్ వ‌ర్మ ర‌ణ‌వీర్ సినిమా ఆగిపోయింది

ABN , Publish Date - May 30 , 2024 | 01:51 PM

డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ వ‌ర్మ.. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ కాంబినేష‌న్‌లో తెర మీద‌కు వ‌చ్చిన‌ ‘రాక్షస్‌’ మూవీ క్రియేటివ్ డిఫరెన్సెస్‌ల కారణంగా ర‌ద్దైంది అన్న ఊహాగానాలు నిజం చేస్తూ స‌ద‌రు నిర్మాణ‌ సంస్థ అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

అనుకున్నంత అయింది.. ప్ర‌శాంత్ వ‌ర్మ ర‌ణ‌వీర్ సినిమా ఆగిపోయింది
prasanth varma

గ‌త కంత‌కాలంగా టాలీవుడ్ సెన్షేష‌న్ డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ వ‌ర్మ (Prashanth Varma).. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ (Ranveer Singh) కాంబినేష‌న్‌లో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers)నిర్మాణంలో ప్రారంభించిన ‘రాక్షస్‌’ మూవీ క్రియేటివ్ డిఫరెన్సెస్‌ల కారణంగా ర‌ద్దైంది అన్న‌ట్లుగా ఊహాగానాలు వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అ వార్త‌లు అవాస్త‌వం వంటూ చెప్పుకొచ్చిన యూనిట్ తాజాగా ఆ వార్త‌ల‌ను నిజం చేస్తూ పెడుతూ స‌ద‌రు నిర్మాణ‌ సంస్థ అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. దీంతో చాలా రోజులుగా వ‌స్తున్న పుకార్ల‌న్నీ నిజ‌మే అనేలా ఈ తాజా ప్ర‌క‌ట‌న ఉంది.

WhatsApp Image 2024-05-30 at 11.09.24 AM.jpeg

ఈ సినిమా విష‌యంలో మొద‌టి నుంచి ఏం జ‌రిగింది, ఈ ప్రాజెక్ట్ గురించి వారేమ‌న్నార‌నే అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ ర‌ణ‌వీర్ సింగ్ (Ranveer Singh), డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ (Prashanth Varma)ల అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తూ మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) నిర్మాణ సంస్థ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఓ నోట్ రిలీజ్ చేసింది. ఇందులో సంద‌ర్భంగా ముందుగా ప్రశాంత్ చాలా ప్రతిభ ఉన్న వాడు మేమిద్దరం కలిసి ఒక సినిమా గురించి అనుకున్నాం కానీ అది అవ్వ‌లేదు. భవిష్యత్తులో ఒక మంచి ప్రాజెక్ట్‌తో మ‌ళ్లీ క‌లుస్తామని ఆశిస్తున్నా అంటూ ర‌ణ‌వీర్ అభిప్రాయ ప‌డ్డాడు.


prashanthvarmaranveersinghf.jpg

అదేవిధంగా.. రణ్‌వీర్ (Ranveer Singh)లోని ఎనర్జీ మరియు టాలెంట్ దొరకడం చాలా అరుదు. భవిష్యత్తులో ఎప్పుడైనా క‌లిసి సినిమా చేస్తా అని ప్ర‌శాంత్ వ‌ర్మ (Prashanth Varma), ఈ ప్రాజెక్ట్‌కు ఇది సరైన సమయం కాదు.. ఫ్యూచ‌ర్‌లో మంచి ప్రాజెక్ట్‌తో మీ ముందుకు వస్తాం అంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) ప్ర‌క‌టించింది.

Updated Date - May 30 , 2024 | 02:47 PM