Dheera: సరదా సరదాగా.. ‘ధీర’ మేకింగ్ వీడియో

ABN , Publish Date - Jan 20 , 2024 | 09:54 PM

‘వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాల తర్వాత హీరో లక్ష్ మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. లక్ష్ చదలవాడ ప్రస్తుతం ‘ధీర’ అనే కమర్షియల్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌‌పై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మేకింగ్ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Dheera: సరదా సరదాగా.. ‘ధీర’ మేకింగ్ వీడియో
Laksh In Dheera Movie

‘వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాల తర్వాత హీరో లక్ష్ మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. లక్ష్ చదలవాడ ప్రస్తుతం ‘ధీర’ అనే కమర్షియల్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌‌పై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా మేకర్స్ చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేశారు.


‘ధీర’ గ్లింప్స్, టీజర్‌ వంటి వాటితో ఈ మూవీ జానర్ ఏంటి? ఎలా ఉండబోతోంది? అనేది హింట్ ఇచ్చేశారు మేకర్లు. ఇప్పుడు ‘ది రైడ్ ఆఫ్ ధీర’ పేరుతో వదిలిన మేకింగ్ వీడియోలో.. షూటింగ్ స్పాట్‌లో యూనిట్ ఎంత సరదాగా ఉందో.. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో.. అనేది తెలుస్తోంది. ఈ మేకింగ్ వీడియో ఆసక్తికరంగా కట్ చేశారు. ‘ధీర’ మూవీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Rashmika Mandanna: రష్మిక డీప్‌ ఫేక్ వీడియో.. ఏపీ వ్యక్తి అరెస్ట్

****************************

*Mohan Babu: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?

****************************

*Varun Tej: మెగా ప్రిన్స్ బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉందంటే?

**************************

*Hansika: 34 నిమిషాల షాట్‌ని సింగిల్ టేక్‌లో..

***************************

Updated Date - Jan 20 , 2024 | 09:54 PM