Devaki Nandana Vasudeva: సూపర్ స్టార్ కృష్ణ జయంతి స్పెషల్‌గా పాటతో వచ్చిన మనవడు

ABN , Publish Date - May 31 , 2024 | 04:23 PM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సెకెండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’. మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ‘జై బోలో కృష్ణ’ పాటతో ముందుకొచ్చారు. డివైన్ వైబ్స్ గల ఈ పాటని సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేశారు. టైటిల్ సూచిస్తున్నట్లుగా ‘జై బోలో కృష్ణ’ జన్మాష్టమి స్పెషల్ సాంగ్‌గా చిత్రీకరించారు.

Devaki Nandana Vasudeva: సూపర్ స్టార్ కృష్ణ జయంతి స్పెషల్‌గా పాటతో వచ్చిన మనవడు
Devaki Nandana Vasudeva Movie Stills

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) సెకెండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva). మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ‘జై బోలో కృష్ణ’ పాటతో ముందుకొచ్చారు. డివైన్ వైబ్స్ గల ఈ పాటని సూపర్‌స్టార్ కృష్ణ జయంతి (Super Star Krishna Jayanthi) సందర్భంగా విడుదల చేశారు. టైటిల్ సూచిస్తున్నట్లుగా ‘జై బోలో కృష్ణ’ (Jai Bolo Krishna Song) జన్మాష్టమి స్పెషల్ సాంగ్. ఇందులో హీరో తన బ్యాచ్‌తో కలిసి పండుగ సెలబ్రేట్ చేస్తున్నట్లుగా ఈ పాట చూస్తుంటే తెలుస్తోంది. భీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ బీట్‌లతో ఆకట్టుకునే ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేశాడు. రఘురామ్ అడ్వకేట్ రాసిన లిరిక్స్ హీరో క్యారెక్టర్‌ని ప్రజెంట్ చేస్తున్నాయి.

Also Read: *Anjali: బాలయ్య నెట్టడంపై రియాక్టైన అంజలి.. ఇక ఫుల్‌స్టాప్‌ పడినట్టేనా?

స్వరాగ్ కీర్తన్ సూపర్బ్ సింగింగ్‌తో పాటకు ఎక్స్ట్రా ఎనర్జీని అందించారు. యష్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేసారు. అశోక్ గల్లా డ్యాన్స్ కూల్ అండ్ ఎలిగెంట్‌గా వుంది. విజువల్స్ వైబ్రెంట్, గ్రాండ్‌గా వున్నాయి. ఇది సినిమా ఆల్బమ్‌లోని మరో చార్ట్‌బస్టర్ సాంగ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పిరిచువల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. (Devaki Nandana Vasudeva Movie)


Super-Star.jpg

ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తుండగా.. ‘హనుమాన్’ ఫేమ్, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. రసూల్ ఎల్లోర్‌తో పాటు ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 01 , 2024 | 11:02 AM